తెలంగాణ

telangana

ద్రవిడ్‌ రికార్డును చెరిపేసిన ధోనీ.. ఈ వయసులో మరో ఘనత

By

Published : May 2, 2022, 6:30 PM IST

Dhoni breaks Dravid record: ఇప్పటికే ఎన్నో ఘనతలను ఖాతాలో వేసుకున్న చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు సాధించాడు. జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన ధోనీ.. ద్రవిడ్ రికార్డును చెరిపేశాడు. అదేంటంటే?

DHONI DRAVID RECORD
DHONI DRAVID RECORD

IPL 2022: రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలను అందుకుని తొలి విజయం నమోదు చేసిన ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 202/2 స్కోరు చేయగా.. హైదరాబాద్‌ 189/6 స్కోరుకు పరిమితమై 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు మీ కోసం..

Dhoni breaks Dravid record: రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డును ధోనీ అధిగమించాడు. 2013లో రాజస్థాన్‌కు సారథిగా 40 ఏళ్ల 268 రోజుల వయసులో ద్రవిడ్‌ ముంబయిపై విజయం సాధించాడు. ఇప్పుడు ధోనీ 40 ఏళ్ల 298 రోజుల వయసులో హైదరాబాద్‌పై కెప్టెన్‌గా విజయం నమోదు చేశాడు.

  • తొలి వికెట్‌కు రుతురాజ్‌ గైక్వాడ్ (99), డేవన్ కాన్వే (85) కలిసి 182 పరుగులను జోడించారు. ప్రస్తుత సీజన్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. చెన్నైకి కూడా ఇదే హైయస్ట్‌ ఓపెనింగ్‌. అంతకుముందు 2020 సీజన్‌లో వాట్సన్‌-డుప్లెసిస్‌ (181) జోడించారు.
  • ఒక్క పరుగు దూరంలో సెంచరీని మిస్‌ చేసుకున్న ఐదో బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ (99). రుతురాజ్‌ కాకుండా విరాట్, పృథ్వీషా , ఇషాన్‌ కిషన్, క్రిస్‌ గేల్ ఉన్నారు. మరికొందరు బ్యాటర్లు 99 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచారు. ఈ జాబితాలో ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.
  • వరుసగా ఐదు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్‌ మరోసారి వరుసగా రెండో పరాజయం చవి చూసింది.
  • అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డు సృష్టించాడు. 154 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఇదే వేగంతో రెండుసార్లు బంతిని విసరడం విశేషం.

ఇదీ చదవండి:'కాస్త బుర్ర వాడు'.. బౌలర్​పై ధోనీ ఫైర్.. ఏమైందంటే?

ABOUT THE AUTHOR

...view details