తెలంగాణ

telangana

IPL 2021: 'ఓటమితో బాధపడినా.. ఈ సీజనే ప్రత్యేకం'

By

Published : Oct 12, 2021, 4:13 PM IST

rcb vs kkr 2021
ఐపీఎల్ 2021 ()

ఈ సీజన్​లో కప్పు సాధించేందుకు (virat kohli in ipl 2021) ప్రతి ఒక్కరం చాలా కష్టపడ్డామని అన్నాడు రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్ కోహ్లీ. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్​లో ఓటమితో తాము నిరాశ చెందామనేది నిజమే అయినా ఎవరూ మనసు విరిగేంతగా బాధపడినట్లు కనిపించలేదని తెలిపాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా కెప్టెన్‌ విరాట్‌ (kohli as rcb captain) కోహ్లీ పదేళ్లు పనిచేశాడు. సోమవారం రాత్రి కోల్‌కతాతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయాక ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం తన జట్టు ఆటగాళ్లతో మాట్లాడాడు. ఆర్సీబీ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 2016 తర్వాత ఈ సీజనే (virat kohli in ipl 2021) తాను అత్యంత గొప్పగా ఆస్వాదించినట్లు చెప్పాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు నిరాశ చెందినా తమ పోరాటపటిమతో ఆకట్టుకున్నారన్నాడు.

"నిజం చెప్పాలంటే మాకు 2016 టోర్నీ ఎంతో ప్రత్యేకమైంది. ఆ సీజన్‌ తర్వాత మళ్లీ ఇప్పుడే అంత బాగా ఆస్వాదించా. ఈ బృందంతో కలిసి ఆడటం, గెలుపోటములు సమానంగా స్వీకరించడం లాంటివన్నీ నా కెంతో ప్రత్యేకం. కప్పు సాధించేందుకు ప్రతి ఒక్కరం చాలా కష్టపడ్డాం. ఈ ఓటమితో మనం నిరాశ చెందామనేది నిజమే అయినా ఎవరూ మనసు విరిగేంతగా బాధపడినట్లు కనిపించలేదు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమే అయినా మనం ఆడిన తీరుకు గర్వంగా ఉంది. ఈ ఫ్రాంఛైజీలో మనం ప్రతిసారీ ఇదే ప్రయత్నిస్తామని అనుకుంటా" అని కోహ్లీ స్పందించాడు.

ఇక ఇన్నాళ్లూ కెప్టెన్‌గా తాను పూర్తి అంకిత భావంతో పనిచేశానని, ఇకపైనా కెప్టెన్‌గా అన్ని నిర్ణయాలు తీసుకోకపోయినా నాయకుడిలా అవసరమైన సలహాలు, సూచనలు చేస్తానని చెప్పాడు కోహ్లీ. చివరగా ఈ సీజన్‌ను గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా అంటూ కోహ్లీ ముగించాడు.

ఇదీ చదవండి:'ఇక అంపైర్లు సంతోషంగా నిద్రపోతారు'.. కోహ్లీపై డివిలియర్స్​ ఫన్నీ ట్రోల్!

ABOUT THE AUTHOR

...view details