తెలంగాణ

telangana

IPL 2021 News: టాస్ గెలిచిన చెన్నై.. సన్​రైజర్స్ బ్యాటింగ్

By

Published : Sep 30, 2021, 7:02 PM IST

Updated : Sep 30, 2021, 7:09 PM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు (సెప్టెంబర్ 30) చెన్నై సూపర్ కింగ్స్​తో తలపడనుంది సన్​రైజర్స్ హైదరాబాద్(SRH vs CSK 2021). ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2021
ఐపీఎల్

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టేబుల్ టాపర్ చెన్నై సూపర్ కింగ్స్​తో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్​రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది(SRH vs CSK 2021). ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్​రైజర్స్ (Sunrisers playoffs) పరువు కాపాడుకోవడమే లక్ష్యంగా ఆడుతోంది. సీఎస్కే మాత్రం టాప్​-4లో అగ్రస్థానమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.

హెడ్ టూ హెడ్

ఇప్పటివరకు ఇరుజట్లు 15 మ్యాచ్​ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 11 సార్లు గెలవగా.. సన్​రైజర్స్ కేవలం 4 మ్యాచ్​ల్లోనే విజయం సాధించింది.

జట్లు

సన్​రైజర్స్ హైదరాబాద్

జాసన్ రాయ్, సాహా, విలియమ్సన్ (కెప్టెన్), ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రైనా, ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హెజిల్​వుడ్

Last Updated : Sep 30, 2021, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details