తెలంగాణ

telangana

ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా: పంత్​

By

Published : Apr 30, 2021, 1:29 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​పై విజయాన్ని కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు అంకితమిస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషబ్​ పంత్​ వెల్లడించాడు. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో లీగ్​లో ముందుకుసాగుతామని తెలిపాడు.

Dedicating this win to all frontline workers, says Pant
ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా

అహ్మదాబాద్​ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. అయితే ఈ గెలుపును కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు అంకితమిచ్చాడు దిల్లీ జట్టు కెప్టెన్​ రిషబ్​ పంత్​. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు.

"కోల్​కతా టీమ్​తో జరిగిన మ్యాచ్​లో మా జట్టు ఆడిన ఆటతీరు థ్రిల్లింగ్​కు గురి చేసింది. ఈ ఆటలో గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని లీగ్​లోని తదుపరి ఆటల్లోనూ కొనసాగిస్తాం. అయితే మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం".

- రిషబ్ పంత్ ట్వీట్​

ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు 7 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఆండ్రూ రసెల్‌ (45 నాటౌట్‌; 27 బంతుల్లో 2×4, 4×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పృథ్వీ మెరుపులతో దిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ఇదీ చూడండి..'కోల్​కతా నైట్​రైడర్స్​ ఆడే మ్యాచ్​లు బోర్​ అబ్బా!'

ABOUT THE AUTHOR

...view details