తెలంగాణ

telangana

T20 World Cup 2021: టీమ్​ఇండియాలో ఉమ్రాన్​కు చోటు!

By

Published : Oct 10, 2021, 12:30 PM IST

ఐపీఎల్​లో హైదరాబాద్​ తరుపున ఆడిన ఉమ్రాన్ మాలిక్​కు అదృష్టం వరించింది. టీ20 ప్రపంచకప్‌ 2021 (T20 World Cup 2021) టీమ్​ఇండియా నెట్ బౌలర్​గా ఎంపిక చేసినట్లు సమాచారం.

umran malik latest news
ఉమ్రన్​ మాలిక్​ లేటెస్ట్ న్యూస్​

టీ20 ప్రపంచకప్‌ 2021 టీమ్​ఇండియా జట్టుకు ఉమ్రాన్‌ మాలిక్‌ నెట్‌ బౌలర్‌గా (umran malik in srh) ఎంపికైనట్లు తెలుస్తోంది. మాలిక్‌ను వెంటనే టీమ్​ఇండియా బయోబబుల్‌లో జాయిన్‌ కావాలంటూ పేర్కొన్నట్లు సమాచారం.

టి20 ప్రపంచకప్‌లో నేరుగా ఆడే అవకాశం లేనప్పటికీ ఐసీసీ లాంటి మేజర్‌ టోర్నీలో నెట్‌బౌలర్‌గా వ్యవహరించడం అదృష్టంగానే భావించవచ్చు. ఒకవేళ బౌలర్‌ ఎవరైనా గాయపడితే నెట్​ బౌలర్​గా ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌ను ఆడించే అవకాశం ఉంటుంది.

జమ్ముకశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్‌.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో (T20 World Cup 2021) ఎస్‌ఆర్‌హెచ్‌ తరుపున మ్యాచ్‌లు ఆడే అవకాశం తక్కువగానే వచ్చినప్పటికీ ప్రతీదాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసిరాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా గంటకు 152.95 కిమీ వేగంతో విసిరి కొత్త రికార్డు నమోదు చేశాడు.

ఇదీ చదవండి:'ఉమ్రన్​ను ముందే ఎందుకు తీసుకోలేదు?'

ABOUT THE AUTHOR

...view details