తెలంగాణ

telangana

'ధోనీ భాయ్.. నా రికార్డు నువ్వు కొట్టడం సంతోషం'

By

Published : Oct 3, 2020, 3:12 PM IST

ఐపీఎల్​లో తన రికార్డును ధోనీ అధిగమించడంపై ఆనందం వ్యక్తం చేసిన రైనా.. ఈసారి చెన్నై జట్టు టైటిల్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.

Suresh Raina reacts after MS Dhoni breaks his big record
ధోనీ రైనా

టీ20 క్రికెట్‌ లీగ్‌లో చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విషయమై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు సహచర క్రికెటర్ సురేశ్ రైనా.

'శుభాకాంక్షలు మహీ భాయ్‌. టీ20 క్రికెట్‌ లీగ్‌లో అత్యధిక మ్యాచులు ఆడి రికార్డు సృష్టించావు. నా రికార్డు నువ్వు బద్దలు కొట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. చెన్నై ఈసారి టైటిల్‌ గెలుస్తుందని నమ్ముతున్నాను' అని రైనా ట్వీట్ చేశాడు.

ఐపీఎల్​లో హైదరాబాద్‌ జట్టుతో మ్యాచ్‌ ధోనీకి 194వ మ్యాచ్‌. దీంతో 193 మ్యాచులు ఆడిన సురేశ్‌ రైనా రికార్డును మహీ తిరగరాశాడు. చెన్నై తరఫున ధోనీకి ఇది 164వ మ్యాచ్‌. ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది. 2016, 17 కాలంలో ధోనీ పుణె జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ABOUT THE AUTHOR

...view details