తెలంగాణ

telangana

పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై.. మీరు విన్నది నిజమే

By

Published : Sep 30, 2020, 11:17 AM IST

ప్రతి సీజన్​లోనూ అదరగొట్టిన చెన్నై.. ఈసారి మాత్రం ఎప్పుడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

MS Dhoni's Chennai Super Kings at the bottom in IPL 2020?
పాయింట్ల పట్టికలో తొలిసారి అట్టడుగున సీఎస్కే!

ఐపీఎల్ చరిత్రలో ఈసారి చెన్నై సూపర్​కింగ్స్​కు ఎదురైన అనుభవాలు, గతంలో ఎప్పుడూ​ రాలేదేమో బహుశా! టోర్నీలో ప్రతిసారి లీగ్​ దశ దాటిన సీఎస్కే.. ఈసారి తమ అభిమానుల్ని నిరాశ పరుస్తోంది. తొలి మ్యాచ్​లో గెలిచిన, తర్వాత రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్​ ధోనీ మెరుపు ఇన్నింగ్స్​తో ఆదుకునేవాడు. కానీ, ఈ సీజన్​లో అతడు ప్రదర్శన కలవరపరుస్తోంది. దీనితో పాటే పాయింట్ల పట్టికలో సీఎస్కే చివరి స్థానంలో నిలిచింది.

దిల్లీ​, హైదరాబాద్ జట్ల​​ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకగా.. చెన్నై చివరి స్థానానికి పడిపోయిది. పట్టికలో సీఎస్కే చివరిస్థానంలో నిలవడం ఇదే తొలిసారి!

ఐపీఎల్​ పాయింట్ల పట్టిక

ఆరంభం బాగుంది.. కానీ

ఈ ఐపీఎల్​లో​ ఇప్పటివరకు ధోనీసేన మూడు మ్యాచ్​లు ఆడింది. ముంబయిపై తొలి మ్యాచ్​ గెలవగా.. మిగిలిన రెండింటిలోనూ(దిల్లీ, రాజస్థాన్​) ఓడిపోయింది.

తక్కువ రన్​రేట్​

పట్టికలో చెన్నై సూపర్​కింగ్స్(-0.840)​ కంటే రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(-1.450) అత్యంత తక్కువ రన్​రేట్​తో ఉంది. కానీ పాయింట్లు ఉండటం వల్ల మూడో స్థానం సొంతం చేసుకుంది. తన తర్వాతి మ్యాచ్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​తో అక్టోబరు 2న ఆడనుంది చెన్నై జట్టు.

ABOUT THE AUTHOR

...view details