తెలంగాణ

telangana

చెన్నైపై ముంబయి గెలుపు... వందో విజయం నమోదు

By

Published : Apr 4, 2019, 2:32 AM IST

సొంత గడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది ముంబయి ఇండియన్స్​. ఐపీఎల్​లో ముంబయికి ఇది వందో విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.

ముంబయి శతక విజయాలు...32 పరుగుల తేడాతో  చెన్నైపై గెలుపు

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబయి ఇండియన్స్​.171 పరుగుల లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది చెన్నై.

టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకుంది చెన్నై. తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి... సూర్యకుమార్​, కృనాల్​, పాండ్య రాణించడం వల్ల 170 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో తడబడింది చెన్నై సూపర్​ కింగ్స్​. 33 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓ ఎండ్​లో వికెట్లు పడుతున్నా సహనంగా ఆడాడు కేదార్​ జాదవ్​. అయినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

కేదార్ ఒంటరి పోరు​...

    నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేదార్​ జాదవ్​ వికెట్లు పడుతున్నా స్కోరు బోర్డును నెమ్మదిగా నడిపించాడు. 54 బంతుల్లో 58 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. 21 బంతుల్లో 12 పరుగులే చేసి విఫలమయ్యాడు కెప్టెన్​ ధోని.

    మొదట్లో తడబడి.. చివర్లో చెలరేగి..
    తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి జట్టు 50 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. డికాక్(4), రోహిత్​(13), యువరాజ్​(4) పరుగులకే పెవిలియన్​ చేరారు.
    • మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చినసూర్యకుమార్​ యాదవ్​ అర్ధశతకంతోరాణించాడు. 43 బంతుల్లో 59 పరుగులు(8ఫోర్లు, ఒక సిక్స్​)చేసి ఔటయ్యాడు. మరోవైపు సూర్యకు తోడుగా కృనాల్​ (42) పరుగులు చేశాడు.
    • హార్దిక్​ హిట్టింగ్...

    19 ఓవర్ల వరకు 141పరుగుల స్కోరు చేసిన ముంబయి జట్టు... చివరి ఓవర్లో భారీగా పరుగులు చేసింది.​ ఆఖరి ఓవర్​ వేసిన బ్రావో 29 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబయి బ్యాట్స్​మెన్​ పాండ్య, పోలార్డ్​ చెలరేగి ఆడారు. దీంతో 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది ముంబయి జట్టు.
    బ్యాటింగ్​లో రాణించిన హర్దిక్​ బౌలింగ్​లోనూ ​అదరగొట్టాడు. 4 ఓవర్లకు 20 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మలింగ 3, బెహ్రండార్ఫ్​​ 2 వికెట్లు తీసి సత్తా చాటారు.

    పొలార్డ్ అద్భుత​ క్యాచ్​లు...

    చెన్నై ఓపెనర్​ షేన్​ వాట్సన్​ సహా ఫామ్​లో ఉన్న రైనాను అద్భుతమైన క్యాచ్​లతో ఔట్ చేశాడు పొలార్డ్​. ఒక దశలో రెండు ఫోర్లు , ఒక సిక్స్​ కొట్టి వేగంగా ఆడుతున్న రైనా ఔట్​ అవ్వడం మ్యాచ్​ను మలుపు తిప్పింది.

    నాలుగు వేల రికార్డు...

    ఈ మ్యాచ్​లో ధోనీ మరో మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్​ కెరీర్​లో 4వేల పరుగుల రికార్డు సాధించాడు. 5087 పరుగులతో రైనా తొలి స్థానంలో ఉన్నాడు.

    ABOUT THE AUTHOR

    ...view details