తెలంగాణ

telangana

శతక్కొట్టిన సంజూ - మూడో వన్డేలో భారత్‌ విజయం - సిరీస్​ మనదేరా

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 10:44 PM IST

Updated : Dec 22, 2023, 6:13 AM IST

India Vs South Africa 3rd ODI : సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా విజయకేతనం ఎగురవేసింది. 78 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసి సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇంతకీ ఈ మ్యాచ్​ ఎలా సాగిందంటే ?

India Vs South Africa 3rd ODI
India Vs South Africa 3rd ODI

India Vs South Africa 3rd ODI :దక్షిణాఫ్రికాపై జరిగిన మూడో వన్డే సిరీస్​లో టీమ్ఇండియాదే పై చేయిగా నిలిచింది. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసి సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఇక అర్ష్‌దీప్‌ (4/30), అవేశ్‌ (2/45), వాషింగ్టన్‌ సుందర్‌ (2/38) దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. ఇక 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా సంజు శాంసన్‌ నిలవగా, అర్ష్‌దీప్‌ సింగ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు లభించింది.

నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసిన భారత జట్టు సౌతాఫ్రికా ముందు 297 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్​లో పలు స్టార్స్​ తమ ఆట తీరుతో చెలరేగడం వల్ల టీమ్ఇండియా భారీ స్కోర్​ను నమోదు చేయగలిగింది. సంజు శాంసన్ (108) శతకాన్ని సాధించగా, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (52) కూడా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. యంగ్​ సెన్సేషన్​ రింకూ సింగ్​ కూడా తన బ్యాట్​కు పని చెప్పి 38 పరుగులతో దూకుడుగా ఆడాడు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం 21 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.

మరోవైపు ఈ మ్యాచ్​లో అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ కూడా మెరుపు వేగంతో ఆడాడు. ఓపెనర్​గా మైదానంలోకి దిగిన రజత్​ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ ఆ ఇన్నింగ్స్​లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సులతో మెరిశాడు. అయితే టోర్నీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్ ఈ సారి నిరాశపరిచాడు. కేవలం 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదిలా ఉండగా సౌతాఫ్రికా బౌలర్లలో బ్యురాన్ హెండ్రిక్స్‌ 3 వికెట్లు పడగొట్టగా, నండ్రీ బర్గర్ రెండు విలియమ్స్, ముల్డర్, కేశవ్‌ మహరాజ్‌ తలో వికెట్ పడగొట్టారు.

ఇక భారత్​ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు సౌతాఫ్రికా జట్టు నుంచి టోనీ డి జోర్జి , రిజా హెండ్రిక్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మన బౌలర్లను కట్టడి చేస్తూ సౌతాఫ్రికా నిలకడగా ఆడారు. అయితే అర్ష్‌దీప్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌కు చిక్కి రిజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. దీంతో సఫారీలు తమ తొలి వికెట్​ను కోల్పోయారు. ఆ తర్వాతి నుంచి భారత బౌలర్లు వేగం పెంచి ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. దీంతో 15 ఓవర్లో సౌతాఫ్రికా తన రెండో వికెట్​ను కోల్పోయింది.

అయితే అప్పటి వరకు నిలకడగా రాణించిన సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ డి జోర్జి (50) అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలా 21వ ఓవర్లకు సఫారీ జట్టు 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా ఆడుతూ వచ్చిన సౌతాఫ్రికాకు మార్‌క్రమ్‌ రూపొంలో (36) మూడో వికెట్ డౌన్ అయ్యింది. ఆ తర్వాత జోర్జి ఔట్‌ కావడంతో సఫారీ జట్టు 29.4 ఓవర్లలో 161/4 స్కోర్​తో ఇబ్బందుల్లో పడింది.

జోర్జి వికెట్‌ను భారత్‌ సమీక్షతో సాధించింది. ఆపై అవేశ్‌ బౌలింగ్‌లో సుదర్శన్‌ పట్టిన డైవ్‌ క్యాచ్‌కు క్లాసెన్‌ (21) కూడా వెనుదిరగడం వల్ల దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 174/5తో కష్టాల్లో చిక్కుకుంది. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఒత్తిడిలో పడిన సఫారీ బ్యాటర్లు ధాటిగా పరుగులు చేయలేకపోయారు. మిల్లర్‌ (10)ను ముకేశ్‌ పెవిలియన్‌ చేర్చడంతో దక్షిణాఫ్రికా పోరాటానికి తెరపడింది. ఆ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్‌ ఎంతోసేపు నిలవలేదు.

ఫస్ట్ మ్యాచ్​లోనే సాయి సుదర్శన్‌ రికార్డులు​- రాహుల్ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని ఘనత!

'చాలా హ్యాపీ- నేను ఇది అస్సలు ఊహించలేదు!- విన్నింగ్ క్రెడిట్‌ వారికే'

Last Updated :Dec 22, 2023, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details