తెలంగాణ

telangana

Ind vs Wi 5th T20 : ఆఖరి మ్యాచ్​లో భారత్​ ఓటమి.. సిరీస్ విండీస్ కైవసం

By

Published : Aug 14, 2023, 6:40 AM IST

Updated : Aug 14, 2023, 8:20 AM IST

Ind vs Wi 5th T20 : ఐదో టీ20 మ్యాచ్​లో భారత్​పై విండీస్ విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 3-2 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది.

Ind vs Wi 5th T20
ఆఖరి మ్యాచ్​లో భారత్​ ఓటమి

Ind vs Wi 5th T20 : వెస్టిండీస్‌తో టీ-20 సిరీస్‌ చివరి మ్యాచ్‌లో టీమ్ఇండియా 8వికెట్ల తేడాతో ఓడిపోయింది. 166 పరుగుల టార్గెట్​ను విండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. బ్రెండన్‌ కింగ్ (85 పరుగులు : 55 బంతుల్లో, 5x4, 6x6), నికోలస్ పూరన్ (47 పరుగులు : 1x4, 4x6) తుపాన్ ఇన్నింగ్స్​తో చెలరేగిపోయారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ తలో వికెట్ తీశారు. దీంతో ఆతిథ్య జట్టు.. ఐదు మ్యాచ్​ల టీ-20 సిరీస్​ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్​పై విండీస్​కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. ఇక భారత్​ ఇన్నింగ్స్​కు కళ్లెం వేసిన పేసర్ షెఫర్డ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', నికోలస్ పూరన్​కు 'మ్యాన్ ఆఫ్​ ది సిరీస్' అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్​తో భారత్ వెస్టిండీస్ పర్యటన ముగిసింది.

అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే విండీస్ బౌలర్ అకీల్.. ఓపెనర్​​ యశస్వి జైశ్వాల్ (5)ను వెనక్కిపంపాడు. జైశ్వాల్ ఇచ్చిన రిటర్న్​ క్యాచ్​ను అకీల్ చురుగ్గా అందుకున్నాడు. కాగా అదే అకీల్.. మూడో ఓవర్లో మరో ఓపెనర్ గిల్ (9)​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్ 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.

మరో వికెట్ పడకుండా కొద్దిసేపు సూర్యకుమార్​ (61)తో, తిలక్ వర్మ (27) జతకట్టాడు. కానీ చేజ్​ బౌలింగ్​లో తిలక్ అతడికే రిటర్న్ క్యాచ్​ ఇచ్చి.. పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (13), కెప్టెన్ హార్దిక్ పాండ్య (14), అక్షర్ పటేల్ (13) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్‌ 4, అకీల్‌ హోసీన్‌ 2, జేలన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్​ ఒక వికెట్ పడగొట్టారు.

సూర్య ఒక్కడే.. భారత్ ఇన్నింగ్స్​లో మొదటి నుంచే వికెట్లు పడుతున్నా.. సూర్య ఒక్కడే క్రీజులో నిలబడ్డాడు. మరో అతడికి సహకారం ఇచ్చేవారు కరవైనా.. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశాడు. ఈ క్రమంలో 16 ఓవర్ తొలి బంతికి సిక్స్​బాది కెరీర్​లో 15వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 18 ఓవర్ చివరి బంతికి హోల్డర్ బౌలింగ్​లో ఫుల్ టాస్​ బంతిని ఆడబోయిన సూర్య ఎల్​బీడబ్ల్యూగా ఔటైయ్యాడు.

Dhanashree Verma Latest Pics : బాబోయ్..​ చాహల్​ భార్య మళ్లీ గ్లామర్ బ్లాస్ట్​.. అసలు ఇలా చూస్తే కుర్రాళ్లు ఏమైపోతారు?

Ind vs Wi 4th T20 : అదరగొట్టిన ఓపెనర్లు.. విండీస్​ను చిత్తు చేసిన భారత్.. 2 - 2 తో సిరీస్ సమం

Last Updated :Aug 14, 2023, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details