తెలంగాణ

telangana

శతకాలతో చెలరేగిన డస్సెన్, బవుమా​.. భారత్​కు భారీ లక్ష్యం

By

Published : Jan 19, 2022, 6:18 PM IST

India vs South Africa: భారత్​తో జరుగుతున్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా 296 పరుగులు చేసింది. డస్సెన్​ (129*), బవుమా(110) శతకాలు సాధించారు. భారత బౌలర్లు బుమ్రా 2, అశ్విన్​ ఒక వికెట్​ తీశారు.

IND VS SOUTH AFRICA
IND VS SOUTH AFRICA

India vs South Africa: దక్షిణాఫ్రికాలోని బోలాండ్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌కు దక్షిణాఫ్రికా 297 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. కెప్టెన్‌ బవుమా (110: 8 ఫోర్లు), మిడిలార్డర్‌ బ్యాటర్‌ డస్సెన్ (129*: 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

ఓపెనర్లు డికాక్ (27) ఫర్వాలేదనిపించగా.. మలన్ (6), మార్‌క్రమ్ (4) విఫలమయ్యారు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడినా.. బవుమా, డస్సెన్ మాత్రం స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు చేసేశారు. నాలుగో వికెట్‌కు 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

భారత బౌలర్లు ఎంత శ్రమించినా.. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details