తెలంగాణ

telangana

పంత్ హాఫ్​ సెంచరీ.. 143 పరుగుల అధిక్యంలో భారత్

By

Published : Jan 13, 2022, 4:09 PM IST

Updated : Jan 13, 2022, 4:42 PM IST

team india

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా మూడో రోజు భారత్​ నిలకడగా ఆడుతోంది. లంచ్​ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

IND vs SA: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మారుతోంది. సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కొని రిషభ్‌ పంత్‌ (51) అర్ధశతకం సాధించాడు. దీంతో మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషభ్‌ పంత్‌తోపాటు విరాట్ కోహ్లీ (28) ఉన్నాడు. టెస్టు సారథి కోహ్లీ ఎంతో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్, రబాడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​ ఆడిన భారత్​ 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 210 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ప్రస్తుతం టీమ్​ఇండియా 143 పరుగులు అధిక్యంలో ఉంది.

ఆరంభంలోనే షాక్..

ఓవర్‌నైట్‌ 57/2 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఇవాళ తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఛెతేశ్వర్‌ పుజారా (9) జాన్సన్ వేసిన షార్ట్‌పిచ్‌ బంతిని ఆడబోయి పీటర్సెన్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (1) మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతడి భవితవ్యంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నట్లే. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే విరాట్ కోహ్లీ, పంత్ జోడీ అర్ధశతక (72) భాగస్వామ్యం నిర్మించి పట్టు నిలిపింది. అంతేకాకుండా మరో వికెట్‌ పడనీయకుండా తొలి సెషన్‌ను ముగించింది.

ఇదీ చదవండి:

IND vs SA: 'కోహ్లీ.. ఎప్పుడూ వారిలో ఉత్సాహాన్ని నింపుతాడు'

IND vs SA: దక్షిణాఫ్రికాకు తలనొప్పిగా కోహ్లీ, పుజారా!

Last Updated :Jan 13, 2022, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details