IND vs SA: 'కోహ్లీ.. ఎప్పుడూ వారిలో ఉత్సాహాన్ని నింపుతాడు'

author img

By

Published : Jan 13, 2022, 11:59 AM IST

Updated : Jan 13, 2022, 12:06 PM IST

bumrah

IND vs SA: వ్యక్తిగత ప్రదర్శన కన్నా జట్టు గెలిచినప్పుడే ఎక్కువ సంతృప్తి కలుగుతుందని టీమ్​ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అన్నాడు. కెప్టెన్​ కోహ్లీ ఎప్పుడూ పేస్​బౌలర్లకు అండగా నిలుస్తాడని కితాబిచ్చాడు. కేప్​టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్​లో బుమ్రా ఐదు వికెట్లు ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.

IND vs SA: కేప్​టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా.. తన అద్భుత ప్రదర్శనతో(5/42) ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు గెలిచినప్పుడే ఎక్కువ సంతృప్తి కలుగుతుందని బుమ్రా అన్నాడు.

ప్రత్యర్థి జట్టు 210 పరుగులకే ఆలౌటవ్వడంలో బుమ్రా కీలక పాత్రపోషించాడు. దీంతో భారత్‌ 13 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 223 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 57/2తో నిలిచింది. పుజారా (9), కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇక రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బుమ్రా.. తన సారథి విరాట్‌కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. పేస్‌బౌలర్లకు అండగా నిలుస్తాడని, వారిలో ఎప్పుడూ ఉత్సాహం నింపుతాడని చెప్పాడు. జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాడని తెలిపాడు. అతడి సారథ్యంలో ఆడటం బాగుంటుందని బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ కేప్‌టౌన్‌ మైదానంలో ఆడటం తనకు మరింత ప్రత్యేకమని చెప్పాడు.

2018లో కోహ్లీ సారథ్యంలోనే తాను ఇదే వేదికపై తొలి టెస్టు ఆడినట్లు గుర్తుచేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టడం ప్రత్యేకంగా ఉందన్నాడు.

అయితే, వ్యక్తిగత ఆటతీరు బాగున్నా అవి జట్టు విజయానికి కృషి చేసినప్పుడే మరింత సంతోషకరంగా ఉంటుందని టీమ్‌ఇండియా పేసర్‌ చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: IND vs SA: 'టెస్టు క్రికెట్​లోనూ ఫ్రీ హిట్​ రూల్​'

Last Updated :Jan 13, 2022, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.