తెలంగాణ

telangana

ఆసీస్​కు బిగ్​ షాక్​.. వార్నర్‌ తలకు గాయం.. మిగతా మ్యాచ్​కు దూరం

By

Published : Feb 18, 2023, 9:07 AM IST

Updated : Feb 18, 2023, 9:12 AM IST

భారత్​- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్​లో కంగూరూలకు గట్టి దెబ్బ ఎదురైంది. తొలి రోజు ఆటలో ఆ జట్టు స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మిగతా మ్యాచ్​కు దూరమయ్యాడు.

warner
warner

IND vs AUS: ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. తొలి రోజు ఆటలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు మిగతా మ్యాచ్​కు దూరమయ్యాడు. అతడికి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రేన్‌షా ఆడనున్నాడు.

తొలిరోజు ఆటలో టీమ్​ఇండియా బౌలర్​ సిరాజ్​ వేసిన ఓ బౌన్సర్ అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన వార్నర్.. ఫిజియోలతో ట్రీట్‌మెంట్ తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత మరో రెండు, మూడు బౌన్సర్లు అతని హెల్మెట్‌కు బలంగా తాకాయి. ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. గాయాలతో బ్యాటింగ్‌ కొనసాగించిన వార్నర్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అతడు మైదానంలోకి రాలేదు. భారత ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్​ కూడా చేయలేదు.

తొలి రోజు ఆట అనంతరం ఉ‌‌స్మాన్ ఖవాజా సైతం వార్నర్ పరిస్థితి అంత బాగాలేదని చెప్పాడు. 'వార్నర్ గాయంపై మెడికల్ స్టాఫ్ శనివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అతడి తలకు, భుజానికి బలమైన గాయాలయ్యాయి. అస్వస్థతకు లోనయ్యాడు. దాంతోనే మైదానంలోకి రాలేదు. అతడి ఏమైందనేది మెడికల్ టీమ్ పరీక్షిస్తోంది' అని ఖవాజా చెప్పుకొచ్చాడు.

Last Updated :Feb 18, 2023, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details