తెలంగాణ

telangana

ఆ క్రికెటర్ అంటే గౌరవం పోయింది: క్రిస్ గేల్

By

Published : Oct 14, 2021, 7:22 AM IST

Updated : Oct 14, 2021, 8:44 AM IST

వెస్టిండీస్ జట్టులో చేరినప్పుడు బౌలింగ్ దిగ్గజం ఆంబ్రోస్​పై ఎంతో గౌరవం ఉండేదని క్రిస్​ గేల్(Ambrose Gayle)​ చెప్పాడు. కానీ, ఇప్పుడు అతడిపై గౌరవం పోయిందని అన్నాడు.

gayle
క్రిస్ గేల్

బౌలింగ్‌ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్‌పై తనకు గౌరవం పోయిందని వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌(Ambrose Gayle) అన్నాడు. తానైతే టీ20 ప్రపంచకప్‌కు గేల్‌ను(Chris Gayle News) ఎంపిక చేయనని ఆంబ్రోస్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో గేల్‌ స్పందించాడు.

"వెస్టిండీస్‌ జట్టులోకి వచ్చినప్పుడు ఆంబ్రోస్‌పై ఎంతో గౌరవం ఉండేది. అతడికి నాపై ఎందుకంత వ్యతిరేకతో అర్థం కావట్లేదు. ఎప్పుడూ నా గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంటాడు. అందరి దృష్టిని ఆకర్షించాలన్నది అతడి ఉద్దేశమా అన్నది నాకు తెలియదు. ఆంబ్రోస్‌ అంటే ఇప్పుడు యూనివర్స్‌ బాస్‌ (గేల్‌)కు ఎలాంటి గౌరవం లేదు. నాకెప్పుడు అతడు కనిపించినా ఇదే చెబుతా. ఒకసారి జట్టు ఎంపికైన తర్వాత ఆ జట్టుకు మద్దతు తెలపడం అవసరం" అని గేల్‌ అన్నాడు.

గేల్‌ పేలవ ఫామ్‌లో ఉన్నాడని.. ఫ్రాంఛైజీల తరఫున, వెస్టిండీస్‌ జట్టు తరఫున రాణించలేకపోయాడని ఆంబ్రోస్‌ ఇంతకుముందు చెప్పాడు.

ఇదీ చదవండి:

ఆ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో

Last Updated :Oct 14, 2021, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details