తెలంగాణ

telangana

గల్ఫ్​ మోసానికి చెక్.. ఒమన్‌లో చిక్కుకున్న నిరుపేద యువతిని కాపాడిన భజ్జీ

By

Published : Sep 8, 2022, 8:45 AM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్.. గల్ప్​ మోసగాళ్ల చెర నుంచి ఓ నిరుపేద యువతిని కాపాడారు. ఎంబసీ అధికారులను సాయంతో ఆమె సురక్షితంగా భారత్​కు చేరుకుంది. దీంతో హర్భజన్​పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

harbhajan-singh-helps
harbhajan-singh-helps

మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌.. గల్ఫ్‌ మోసగాళ్ల చెర నుంచి ఓ నిరుపేద యువతిని కాపాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఎంబసీ అధికారుల చొరవతో ఆమెను సురక్షితంగా భారత్​కు చేరుకుంది.
అసలేం జరిగిందంటే?
పంజాబ్‌లోని బఠిండా జిల్లా బార్‌కండి గ్రామానికి చెందిన సికందర్‌సింగ్‌ దినకూలీ. ఈయనకున్న ముగ్గురు సంతానంలో కమల్జీత్‌ కౌర్‌ (21) పెద్దమ్మాయి. తండ్రి కష్టాన్ని పంచుకుందామని స్థానిక ఏజెంటు ద్వారా గత ఆగస్టు నెలాఖరులో ఈమె ఒమన్‌ రాజధాని మస్కట్‌ చేరింది. అక్కడ భారతీయ కుటుంబంలో పనికి కుదుర్చుతామని చెప్పారు. ఒమన్‌ ఏజెంటు అర్బన్‌ విమానాశ్రయం నుంచి నేరుగా ఫలజ్‌ అల్‌ ఖబైల్‌ అనే చోటుకు ఈమెను తీసుకువెళ్లాడు. వెళ్లగానే కమల్జీత్‌ పాస్‌పోర్టు, సిమ్‌కార్డు లాక్కొన్నారు.

అక్కడ మరో 20 మంది మహిళలు ఉన్నారు. అందరూ భారతీయులే. ఈమె చేత బలవంతంగా బుర్ఖా ధరింపజేసి, అరబిక్‌ భాష నేర్చుకోవాలని హుకుం జారీ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన కమల్జీత్‌.. తర్వాత అతి కష్టం మీద కొత్త సిమ్‌కార్డు సంపాదించి తండ్రికి ఫోను చేసింది. జరిగిందంతా చెప్పి బావురుమంది. ఈ విషయం అక్కడున్న సంరక్షకులకు తెలిసిపోయి ఆమెను కర్రతో చితకబాదారు. తన కుమార్తెను ఎలాగైనా మళ్లీ వెనక్కు రప్పించాలని సికందర్‌సింగ్‌ ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి, స్థానిక ఏజెంటు చేతికి మరో రూ.2.5 లక్షలు అందించాడు.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హర్భజన్‌సింగ్‌కు స్థానిక ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ద్వారా ఈ విషయం తెలియడంతో ఆయన మానవతా హృదయంతో స్పందించారు. ఒమన్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి, సహాయం చేయవలసిందిగా కోరారు. ఎంబసీ అధికారుల చొరవతో సెప్టెంబరు 3న మస్కట్‌లో భారత విమానమెక్కి కమల్జీత్‌ ఇంటికి చేరింది. తనలా అక్కడ చిక్కిన మిగతా భారతీయ యువతుల విడుదలకు కూడా ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరుతోంది.

ఇవీ చదవండి:'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

'కర్తవ్యపథ్'​గా మారనున్న 'రాజ్​పథ్'​.. మోదీ చేతులమీదుగా నేడే ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details