తెలంగాణ

telangana

టీ20ల్లో పంత్​ కార్తీక్​, బెస్ట్​ ప్లేయర్​ ఎవరంటే

By

Published : Aug 30, 2022, 12:50 PM IST

ఆసియా కప్​లో భాగంగా భారత్​ పాకిస్థాన్​ మ్యాచ్​లో రిషబ్​ పంత్​ను కాదని అనూహ్యంగా దినేశ్​ కార్తీక్​ను ఆడించడం సరైన నిర్ణయమేనని టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్య, డీకే వంటి ఫినిషర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుడుతోందని అన్నాడు.

rishabh panth dinesh karthik
rishabh panth dinesh karthik

ఆసియా కప్‌ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం.. దాయాది జట్టు పాకిస్థాన్​పై టీమ్​ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. అయితే ఈ మ్యాచ్​కు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మేనేజ్​మెంట్‌ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. తుది జట్టులో ఫామ్‌లో ఉన్న పంత్‌ను కాదని అనూహ్యంగా దినేష్‌ కార్తీక్‌ వైపు జట్టు మేనేజేమెంట్‌ మొగ్గు చూపింది. అయితే ఈ నిర్ణయంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొం‍తమంది తప్పుపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్‌ హార్భజన్‌ సింగ్‌ స్పందించాడు.

"రిషబ్‌ పంత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడు కేవలం టెస్టులు, వన్డేల్లో మాత్రమే రాణిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో మాత్రం పంత్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు దినేష్‌ కార్తీక్‌ ఈ పొట్టి ఫార్మాట్‌లో గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయకూడదు. కాబట్టి పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమే."

-- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్​

"రిషబ్‌ పంత్‌ యువ ఆటగాడు. అతడికి ఇంకా చాలా సమయం ఉంది. కార్తీక్​కు ఇంకా కొన్నేళ్లు మాత్రమే క్రికెట్‌ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జట్టులో ఉన్నప్పుడే అతడిని సద్వినియోగం చేసుకోవాలి. అతడు టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు పొందాడు. హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్ వంటి ఫినిషర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుడుతోంది" అంటూ హార్భజన్‌ సింగ్​ చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి:టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్‌, స్టార్​ పేసర్​ వచ్చేస్తున్నాడు

కోహ్లీ దెబ్బకు కింద పడిపోయిన రోహిత్, ఏం జరిగిందంటే

ABOUT THE AUTHOR

...view details