తెలంగాణ

telangana

'బాబర్ ఇంకా నేర్చుకోవాలి.. ఫైనల్​లో ఇంగ్లాండ్​దే పైచేయి'.. పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్​

By

Published : Nov 12, 2022, 8:44 PM IST

టీ20 ప్రపంచకప్​ చివరదశకు చేరుకుంది. ఆదివారం ఫైనల్​ మ్యాచ్​ పాకిస్థాన్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్​ జట్టు మాజీ కెప్టెన్​, ఆల్​రౌండర్​ ముస్తాక్​ మహ్మద్​ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే..

Pak Allrounder Mushtaq Mohammad Interview
Pak Allrounder Mushtaq Mohammad Interview

Pak Allrounder Mushtaq Mohammad Interview: టీ20 ప్రపంచకప్​ 2022 తుదిదశకు చేరుకుంది. ఆదివారం మెల్​బోర్న్​ వేదికగా.. పాకిస్థాన్​, ఇంగ్లాండ్​ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే గ్రౌండ్​లో ఇంగ్లాండ్​తో పాక్​ జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ జట్టు మాజీ సారథి, ఆల్​రౌండర్​ ముస్తాక్​ మహ్మద్​.. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈటీవీ భారత్​: ఒకే వేదికపై 30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం కానుంది, దానిపై మీ స్పందన ఏంటి?
ముస్తాక్​: అవును ఎంసీజీలో చరిత్ర పునరావృతం కానుంది! ఇదొక రసవత్తరమైన మ్యాచ్​. అందులో ఎటువంటి సందేహం లేదు.

ఈటీవీ భారత్​: ఇంగ్లాండ్​, పాకిస్థాన్​ జట్లపై మీ అభిప్రాయం?
ముస్తాక్:ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఇంగ్లాండ్​ ఒకటి. అయితే టోర్నీ ఫైనల్​కు అదృష్టంతో చేరుకున్న పాకిస్థాన్​ జట్టు తమ దేశంపై మంచి అభిప్రాయాన్ని ఉంచుకుని మ్యాచ్​ ఆడాలి.

ఈటీవీ భారత్​: ప్రపంచకప్​లో పాకిస్థాన్​ జర్నీ గురించి చెప్పండి?
ముస్తాక్​:మొదట్లో పాకిస్థాన్​ జట్టు అంతగా ఆడలేదు. క్రమంగా ఆటగాళ్లు ఊపందుకున్నారు. అలా మంచి ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం పాకిస్థాన్ బౌలింగ్​ పటిష్ఠంగా ఉంది.

ఈటీవీ భారత్​: ఇరుజట్లలో ఏ ప్లేయర్ల కీలక పాత్రలు పోషిస్తారని అనుకుంటున్నారు?
ముస్తాక్:అందరూ కీలక పాత్రలు పోషించాలి. బ్యాటర్లు పరుగులు సాధించాలి అలాగే బౌలర్లు వికెట్లు పడగొట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడాలి.

​ఈటీవీ భారత్​: రెండు జట్లను పోలిస్తే మీరు ఎటువైపు మొగ్గు చూపుతారు?
ముస్తాక్:నేను రెండు వైపులా పోల్చి చూడవలసి వస్తే.. ఇంగ్లాండ్ చాలా బెటర్ అని చెబుతా. ఎందుకంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింటిలోనూ వాళ్లు చాలా బలంగా ఉన్నారు. వాళ్లలో ఎక్కువ ప్రొఫెషనలిజం ఉంది. టోర్నీలోని అత్యుత్తమ జట్లలో ఇంగ్లాండ్ ఒకటని నా అభిప్రాయం. అయితే పాకిస్థాన్ గెలవాలంటే మాత్రం మనస్ఫూర్తిగా తమ అత్యుత్తమైన ప్రతిభతో ఆడాలి.

​ఈటీవీ భారత్​: పాకిస్థాన్​ జట్టు కెప్టెన్​ బాబర్​ అజామ్​కు మీరు ఇచ్చే రేటింగ్​ ఎంత?
ముస్తాక్:బాబర్​ ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. క్రమంగా అతడు మెరుగుపడతాడని భావిస్తున్నాను.

57 టెస్ట్​ మ్యాచ్​ల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు ముస్తాక్. ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసి ఐదు వికెట్లు తీసిన ఏకైక పాక్ క్రికెటర్​గా ముస్తాక్​ రికార్డు సృష్టించాడు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details