తెలంగాణ

telangana

పాక్​ స్టార్​తో వార్నర్​ 'తగ్గేదే లే'​.. నవ్వులు పూయిస్తున్న వీడియో

By

Published : Mar 24, 2022, 10:22 AM IST

Updated : Mar 24, 2022, 10:35 AM IST

David Warner Ahaheen Afridi: ఆస్ట్రేలియా, పాకిస్థాన్​తో జరుగుతున్న మూడో టెస్టులో బ్యాటర్​ డేవిడ్‌ వార్నర్‌, షాహీన్‌ అఫ్రిదీ మధ్య సరదా సన్నివేశం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Warner - Afridi
వార్నర్​- అఫ్రిదీ

David Warner Ahaheen Afridi: ఆస్ట్రేలియా బ్యాటర్​ డేవిడ్‌ వార్నర్‌, పాకిస్థాన్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లాహోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో చివరి బంతికి సరదా సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది, దీంతో మూడో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 11/0గా నమోదైంది. ఓపెనర్లు ఖవాజా (7), వార్నర్‌(4) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 134 పరుగులకు చేరింది.

ఈ క్రమంలోనే అఫ్రిదీ వేసిన చివరి బంతిని వార్నర్‌ డిఫెన్స్‌ చేశాడు. బంతి అక్కడే పడటం వల్ల అతడు పరుగు తీసేలా కనిపించి మళ్లీ వెనక్కి తగ్గాడు. అదే సమయంలో పాక్‌ పేసర్‌ వార్నర్‌ మీదకు దూసుకొచ్చి ముఖంపై ముఖం పెట్టి చూశాడు. దానికి వార్నర్‌ సైతం తగ్గేదేలే అనేలా చూశాడు. అయితే, క్షణాల్లోనే ఆ ఇద్దరూ నవ్వుకుంటూ వెనక్కి వెళ్లారు. దీంతో అది చూసిన వారంతా తొలుత ఏమైందో అర్థంకాక తికమకపడ్డారు. కానీ, తర్వాత ఆ విషయాన్ని అర్థంచేసుకున్న తోటి ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. ఇక్కడ అఫ్రిదీ.. వార్నర్‌ కన్నా చాలా ఎక్కువ ఎత్తు ఉండడం వల్ల నెటిజన్లు ఈ విషయంపై సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఈ వీడియోను అభిమానులతో పంచుకోవడం వల్ల అది కాస్తా వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియో చూసేయండి.

ఇదీ చదవండి:ICC Rankings: మరోసారి నెం.1గా జడ్డూ.. రోహిత్​ డౌన్​

Last Updated : Mar 24, 2022, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details