తెలంగాణ

telangana

'ధోనీభాయ్ నాకు స్నేహితుడు మాత్రమే కాదు'

By

Published : Aug 2, 2020, 3:22 PM IST

ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రైనా.. తనకు గురువు, మార్గనిర్దేశకుడు అతడని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్​ వేదికగా మహీకి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

'ధోనీభాయ్ నాకు స్నేహితుడు మాత్రమే కాదు'
ధోనీ-రైనా

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తనకు మార్గనిర్దేశనం చేసే శక్తి, గురువు లాంటి వాడని చెబుతూ అతడికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. చెన్నై సూపర్​కింగ్స్ ట్వీట్ చేసిన వీడియోకు స్పందిస్తూ ఇలా రాసుకొచ్చాడు.

"మా జ్ఞాపకాలతో వీడియో చేసినందుకు @చెన్నైఐపీఎల్​కు ధన్యవాదాలు. ధోనీ భాయ్ నాకు స్నేహితుడు మాత్రమే కాదు. నాలో శక్తిని నింపే మార్గనిర్దేశకుడు, గురువు. ఎన్నోసార్లు కష్ట సమయాల్లో అండగా నిలిచాడు. థ్యాంక్యూ మహీ భాయ్. హ్యాపీ ఫ్రెండ్​షిప్ ​డే" అని రైనా రీట్వీట్ చేశాడు.

వీరిద్దరూ ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్​కింగ్స్​కు ఆడుతున్నారు. ఎన్నో విజయాలను అందించి ఉత్తమ జోడీగా పేరు తెచ్చుకున్నారు.

రైనాతో పాటే దిగ్గజ సచిన్​.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెండ్స్​తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. వాళ్లు మైదానంలో ఫ్లడ్​లైట్స్ లాంటి వారని, ఓ మూలన కూర్చొని మన విజయాలను ఆస్వాదిస్తుంటారని అన్నాడు. తనకు ప్రతిరోజూ 'ఫ్రెండ్​షిప్ డే' అని చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details