తెలంగాణ

telangana

'ధోనీ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'

By

Published : Jul 24, 2020, 9:35 PM IST

ఎట్టకేలకు క్రికెట్ అభిమానులకు శుభవార్త వినిపించింది బీసీసీఐ. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ విషయంపై బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కూడా స్పందించాడు. ధోనీ ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

'ధోనీ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'
'ధోనీ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'

సెప్టంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునుగి తేలుతున్నారు. కరోనా కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన క్రికెటర్లు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆట కోసం ఫ్యాన్స్​ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందులో దృష్టంతా ధోనీపైనే.

గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ఆటకు దూరయ్యాడు మహీ. దీంతో అతడి రాక కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులే కాక సహ ఆటగాళ్లు, మాజీలు, క్రీడాకారులు మహీ ఎప్పుడు మైదానంలో దిగుతాడా అని చూస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ఆటగాడు శ్రీకాంత్ కూడా ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

"ఐపీఎల్ జరుగుతుందన్న వార్త వినడం చాలా ఆనందంగా ఉంది. ధోనీ ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా."

-శ్రీకాంత్, బ్యాడ్మింటన్ ఆటగాడు

ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. దీంతో ఆ సమయంలో ఐపీఎల్​ను నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. దీనిపై చర్చలు జరిపిన బీసీసీఐ.. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details