తెలంగాణ

telangana

'బాలా' శిఖర్‌ ధావన్‌పై భువనేశ్వర్‌ సరదా పంచ్​

By

Published : Nov 9, 2019, 6:25 PM IST

టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్ శిఖర్​ ధావన్​​.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. ఇటీవలే ఇన్​స్టాలో ఓ వీడియో పోస్టు చేయగా.. దానిని ట్రోల్​ చేశాడు సహచర క్రికెటర్​ భువనేశ్వర్​.

'బాలా' శిఖర్‌ధావన్‌పై భువనేశ్వర్‌ సరదా పంచ్​

బంగ్లాదేశ్​పై రెండో టీ20లో భారత్​ ఘనవిజయం సాధించింది. ఓపెనర్ రోహిత్​(85)కు చక్కటి సహకారమందించాడు శిఖర్ ధావన్. ఈ మ్యాచ్​లో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిందీ జోడీ. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన వారిగానూ నిలిచారు. మొత్తంగా 51 మ్యాచ్​ల్లో 1740 రన్స్​ చేశారు.

మ్యాచ్‌ అనంతరం ధావన్‌ ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్టు చేయగా, బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ ట్రోల్‌ చేశాడు.

ఇందులో అక్షయ్‌కుమార్‌ 'హౌస్​ఫుల్‌-4'లోని ఓ సన్నివేశాన్ని ఖలీల్‌, చాహల్‌తో కలిసి ధావన్ అనుకరించాడు. చాహల్‌ శబ్దం చేసిన ప్రతిసారీ మతిమరుపు వ్యక్తిలా శిఖర్ నటించాడు. ఈ వీడియోను 'బాలా కే సైడ్‌ ఎఫెక్ట్స్‌' అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడీ క్రికెటర్.

దీనిపై స్పందించిన భువనేశ్వర్‌.. "మర్చిపోయినట్టు నటించడం ఎందుకు. అది సహజ నైపుణ్యమే" కదా అని సరదాగా కామెంట్‌ చేశాడు.

ప్రస్తుతం బంగ్లాదేశ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​ను​ 1-1తో టీమిండియా సమం చేసుకుంది. నాగ్‌పుర్‌ వేదికగా నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details