తెలంగాణ

telangana

ఆస్ట్రేలియాదే చివరి మ్యాచ్​.. సిరీస్​ మాత్రం భారత్​దే

By

Published : Dec 8, 2020, 5:34 PM IST

Updated : Dec 8, 2020, 6:05 PM IST

సిడ్నీ వేదికగా టీమ్​ఇండియాతో జరిగిన చివరి టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్లో గెలిచినా 1-2 తేడాతో సిరీస్​ను చేజార్చుకున్నారు. హార్దిక్​ పాండ్య మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు.

India vs Australia 3rd T20: Australia beat India by 12 runs
ఆస్ట్రేలియాదే చివరి మ్యాచ్​.. సిరీస్​ కైవసం చేసుకున్న భారత్​​

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (80), మాక్స్‌వెల్‌ (54) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్​ విరాట్ కోహ్లీ (85) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. స్వెప్సన్‌ (3/23) టీమిండియాను ఘోరంగా దెబ్బతీశాడు. ఈ విజయంతో ఆసీస్‌ 1-2తో మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ తప్పించుకుంది.

ట్రోఫీతో కెప్టెన్ విరాట్ కోహ్లీ

మాక్సీ-వేడ్‌ ధనాధన్‌

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్‌ ఫించ్‌ను ఖాతా తెరవకముందే సుందర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌ (24)తో కలిసి వేడ్‌ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలు సాధించారు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 51 పరుగులు చేసింది. అయితే స్మిత్‌ను బోల్తాకొట్టించి 65 పరుగుల వారిద్దరి భాగస్వామ్యానికి సుందర్‌ తెరదించాడు. ఆ తర్వాత కోహ్లీసేనకు ఆసీస్‌ అవకాశమే ఇవ్వలేదు.

కెప్టెన్​ విరాట్ కోహ్లీ

పేలవమైన ఫీల్డింగ్​

మాక్స్‌వెల్‌తో కలిసి వేడ్‌ దూకుడుగా ఆడాడు. మాక్సీ స్విచ్‌షాట్లు, లాఫ్టెడ్‌ షాట్ల ఆడటం వల్ల స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే 13వ ఓవర్‌లో చాహల్‌ బౌలింగ్‌లో మాక్సీ వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చేతికి చిక్కాడు. కానీ అది నోబాల్‌‌ కావడం వల్ల భారత్‌కు నిరాశ తప్పలేదు. అనంతరం మాక్స్‌వెల్.. వేడ్‌తో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. ఆయితే భారత్‌ ఆఖరి రెండు ఓవర్లలో వికెట్లు తీయడం వల్ల ఆసీస్‌ స్కోరు 200 దాటలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేలవంగా ఫీల్డింగ్‌ చేసింది. సులువైన క్యాచ్‌లు జారవిడిచింది. భారత బౌలర్లలో సుందర్‌ రెండు, శార్దూల్‌, నటరాజన్‌ తలో వికెట్ తీశారు.

వాషింగ్టన్​ సుందర్​ను అభినందిస్తున్న కోహ్లీ, ధావన్​, కేఎల్​ రాహుల్

ఈ సిరీస్​లో భారత్​ కీలకమైన విజయానికి కారణమైన ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా 'మ్యాన్​ ఆఫ్​ ద సిరీస్​'కు ఎంపికయ్యాడు.

తొలుత జరిగిన వన్డే సిరీస్​ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలిచింది.

విజయోత్సాహంలో ఆస్ట్రేలియా

డిసెంబర్​ 17 నుంచి ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్​ల టెస్టు సిరీస్​ జరగనుంది. 17న అడిలైడ్​ వేదికగా తొలి టెస్టు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

Last Updated : Dec 8, 2020, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details