తెలంగాణ

telangana

36కే కుప్పకూలిన భారత్.. ఆసీస్ లక్ష్యం 90

By

Published : Dec 19, 2020, 11:13 AM IST

Updated : Dec 19, 2020, 12:21 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్​లో భారత బ్యాట్స్​మెన్ దారుణంగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్​లో కేవలం 39 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. షమీ రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. టెస్టు చరిత్రలో భారత్​కు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.

match second Innings
30 పరుగులకే చాపచుట్టేసిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఘోరంగా విఫలమైంది. 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరు (42)ను తిరగరాసింది. టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది.

శనివారం మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్‌ నుంచే వికెట్ల వేట మొదలెట్టిన ఆసీస్‌ బౌలర్లు గంటన్నరలో భారత బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూల్చారు. హాజిల్‌వుడ్‌ 5/8, కమిన్స్‌ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడం వల్ల భారత బ్యాటింగ్‌ లైనప్‌ పేక మేడలా కూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ నమోదు చేయలేదంటే కోహ్లీసేన ఎలా ఆడిందో అర్థమవుతుంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 21.2 ఓవర్లలో 36/9తో నిలిచింది. చివరికి మహ్మద్‌ షమీ(0) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగడం వల్ల భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫలితంగా ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. మయాంక్‌ అగర్వాల్‌(9), హనుమ విహారి(8) టాప్‌ స్కోరర్లు.

Last Updated :Dec 19, 2020, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details