తెలంగాణ

telangana

టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్

By

Published : Dec 4, 2020, 1:12 PM IST

Updated : Dec 4, 2020, 1:42 PM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు తొలి టీ20 జరగబోతుంది. వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్​ఇండియా ఈ సిరీస్​లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

IND vs AUS T20: IND won the toss and elected to bat first
టాస్ గెలిచిన ఆసీస్.. భారత్ బ్యాటింగ్

వన్డే సిరీస్​ కోల్పోయినా సరే చివరి మ్యాచ్​లో గెలిచి పరువు నిలుపుకొంది టీమ్​ఇండియా. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు టీ20 సిరీస్​కు సిద్ధమవుతోంది. కాన్​బెర్రా వేదికగా నేడు తొలి మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో గెలుపు కోసం ఇరుజట్లు శ్రమిస్తున్నాయి. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. నటరాజన్ ఈ మ్యాచ్ ద్వారా టీ20 అరంగేట్రం చేయబోతున్నాడు.

జట్లు

భారత్

శిఖర్ ధావన్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), మనీశ్ పాండే, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, షమీ, నటరాజన్

ఆస్ట్రేలియా

ఫించ్, షార్ట్, వేడ్, స్మిత్, హెన్రిక్స్, మ్యాక్స్​వెల్, సీన్ అబాట్, స్టార్క్, స్వెప్సన్, జంపా, హెజిల్​వుడ్

Last Updated : Dec 4, 2020, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details