తెలంగాణ

telangana

వన్డేల్లో ఆసీస్​ మహిళా జట్టు అదిరే రికార్డు

By

Published : Apr 4, 2021, 4:11 PM IST

వరుసగా ఎక్కువ మ్యాచ్​ల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది. ఇంతకీ ఆ జట్టు ఎన్ని మ్యాచ్​లు గెలిచిందంటే?

Australia's women team claim longest-winning streak in international cricket
వన్డేల్లో ఆసీస్​ మహిళా జట్టు అదిరే రికార్డు

అంతర్జాతీయ క్రికెట్​లో ఆస్ట్రేలియా మహిళ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా 22 మ్యాచ్​ల్లో గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్​పై ఆదివారం తొలి వన్డే విజయంతో ఈ మార్క్​ను అందుకుంది.

2018లో భారత మహిళా జట్టుపై మొదలైన వీరి జైత్రయాత్ర.. ప్రస్తుత మ్యాచ్​ వరకు కొనసాగింది. అంతకు ముందు ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఖాతాలో 21 విజయాలతో ఈ రికార్డు ఉంది.

ఆదివారం జరిగిన మహిళల తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 212 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 38.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మ్యాచ్​ను సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా.

ABOUT THE AUTHOR

...view details