తెలంగాణ

telangana

2023లో పరుగుల మోతలే కాదు- వివాదాల రికార్డులూ ఉన్నాయి!

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 7:18 PM IST

Cricket Clashes In 2023 : క్రికెట్​ చరిత్రలోనే 2023 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈసారి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది మన దేశం. ఇదిలా ఉంటే ఈ ఏడాది క్రికెట్​లో ఎన్ని మధుర జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలను చూశాం. వాటిలో కొన్ని మీ కోసం.

Cricket Clashes In 2023
Cricket Clashes In 2023

Cricket Clashes In 2023 : మరో 20 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా ఎందరో ఆదరించే క్రికెట్​ ఆటలో ఎన్నో రికార్డులను చూశాము. వీటితో పాటు చెరగిపోని జ్ఞాపకాలు, మరిచిపోని చేదు అనుభవాలను, సన్నివేశాలము చూశాము. వీటిలో కొన్ని వివాదాలకు ఫుల్​ స్టాప్​ పడగా మరికొన్ని అలానే ఉండిపోయాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేయండి.

కోహ్లి-గంభీర్​-నవీనుల్​!
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్​లో బెంగళూరు-లఖ్​నవూ మధ్య జరిగిన మ్యాచ్​లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్​కు గురిచేసింది. ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ్​ గంభీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అంతకుముందు కోహ్లితో అఫ్గాన్​ ప్లేయర్​ నవీనుల్​ హక్​ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో తన యాటిట్యూడ్​ను కోహ్లిపై చూపించాడు. ఈ వరుస వివాదాలతో మైదానం మొత్తం హీటెక్కిపోయింది. అయితే కొన్ని నెలల తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్​లో కోహ్లి-నవీనుల్​ మధ్య నెలకొన్న మనస్ఫర్థలకు ఎండ్ కార్డ్ పడింది.

సీనియర్ల మధ్య ఘర్షణ!
ఇటీవల జరిగిన లెజెండ్స్ లీగ్ టీ10 క్రికెట్​లో సీనియర్ ప్లేయర్లు గౌతమ్​ గంభీర్​- శ్రీశాంత్ మధ్య కూడా ఓ వివాదం తలెత్తింది. శ్రీశాంత్​ బౌలింగ్​లో గంభీర్ వరుసగా ఓ సిక్సర్, బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరి ముఖాలు సీరియస్​గా మారిపోయాయి. కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ పీక్స్​కు చేరుకుంది. ఈ క్రమంలో అంపైర్లు రావడం వల్ల ఇద్దర మధ్య వాగ్వాదానికి కాస్త బ్రేక్​ పడింది. ఆ తర్వాత శ్రీశాంత్​ గంభీర్​ను ఉద్దేశిస్తూ సోషల్​ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై LLC నిర్వాహకులు శ్రీశాంత్​కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ వివాదం ఇంకా ముగిసిపోలేదు.

టైమ్డ్​అవుట్​ తెచ్చిన వివాదం!
తాజాగా ముగిసిన 2023 ప్రపంచకప్​లో క్రికెట్​ చరిత్రలోనే విచిత్రమైన కారణంతో బ్యాటర్ ఔటయ్యాడు. బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్​లో లంక ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్​అవుట్​గా ప్రకటించారు అంపైర్లు. ఈ మ్యాచ్​లో శ్రీలంక బ్యాటర్​ సధీర సమరవిక్రమ ఔట్​ అయిన తర్వాత మాథ్యూస్ మైదానంలోకి రెండు నిమిషాల్లోపు రావాల్సి ఉంది. కానీ, మాథ్యూస్​ మాత్రం ఆ సమయం దాటాక వచ్చాడు. దీంతో బ్యాటర్ క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడని, అతడ్ని టైమ్​డ్‌ ఔట్​గా ప్రకటించాలని బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేశారు. రూల్స్ ప్రకారం మాథ్యూస్​ను అంపైర్లు టైమ్​డ్‌ ఔట్​గా ప్రకటించారు. దీంతో క్రికెట్​ చరిత్రలోనే ఒక ప్లేయర్​ ఆడకుండానే వెనుదిరగడం మొదటిసారి. ఇదే కోపంతో శ్రీలంక జట్టు ఆటగాళ్లు ఎవరూ మ్యాచ్​ ముగిసిన తర్వాత బంగ్లా ప్లేయర్స్​కు షేక్​ హ్యాండ్​ ఇవ్వలేదు.

కప్పుపై కాళ్లు..కేసు!
2023 ప్రపంచకప్​ నెగ్గిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగ నిలిచింది. అయితే ట్రోఫీ గెలిచిన ఆనందంలో సంబరాలు చేసుకోవాల్సిన ఆసీస్​ ఆటగాళ్లలో ఒకడైన మిచెల్​ మార్ష్​ శ్రుతి మించాడు. తన అహంకార బుద్ధిని బయటపెట్టుకున్నాడు. క్రికెట్​ లవర్స్​ ఎంతో అభిమానించే వరల్డ్​కప్​ కప్పుపై కాళ్లు పెట్టి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. అది కూడా చేతిలో మందు సీసా పట్టుకొని మరీ కూర్చున్నాడు. ఈ ఫొటో కాస్త వైరల్​గా మారడం వల్ల అతడిని పెద్ద ఎత్తున్న విమర్శించారు చాలామంది. అంతేకాకుండా ఇదే విషయంపై అతడిపై పోలీస్​ కేసు కూడా నమోదైంది.

టీ20ల్లోనూ విరాట్, రోహితే టాప్​- లిస్ట్​లో ఉన్న టీమ్ఇండియా బ్యాటర్లు వీళ్లే!

'అలాంటి వారికి కెప్టెన్సీ ఇవ్వకూడదు'- టీ20 వరల్డ్​కప్​ సారథిపై గంభీర్ కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details