తెలంగాణ

telangana

CSKలో ప్లేస్ కోసం దూబె X చాహర్!.. వచ్చే ఏడాది సింగిల్ ఓవర్ ఫైట్?

By

Published : Aug 7, 2023, 10:20 AM IST

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు దీపక్ చాహర్, శివమ్ దూబె మధ్య ఫన్నీవార్ నడిచింది. తన సీఎస్​కే ఆల్​టైమ్ 11 జట్టును చెప్పుకొచ్చిన దూబెకు.. చాహర్ సరదాగా పెట్టిన కామెంట్ వైరలైంది. మరి అదేంటంటే?

dube chahar funny war
దూబె చాహర్ ఫన్నీవార్

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు శివమ్‌ దూబె, దీపక్‌ చాహర్‌ ఒకరినొకరు వాదించుకున్నారు! వీరిద్దరి మధ్య ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ వార్ జరిగింది. ఒక ఓవర్ బౌలింగ్ చేసి.. ఎవరి గెలుస్తారో చూసుకుందాం అంటూ శివమ్ దూబెకు, చాహర్ సోషల్ మీడియాలో సవాల్ విసిరాడు. దీనికి స్పందించిన దూబె ఏమన్నాడంటే..

శివమ్ దూబె తన ఆల్ టైమ్ 11 చెన్నై తుది జట్టును చెప్పిన వీడియోను సీఎస్​కే ఫ్రాంచైజీ ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. అయితే దూబె.. చెన్నై జట్టుకు ఇదివరకు ఆడిన.. ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల నుంచి 11 మందిని ఎంపిక చేస్తూ.. వీడియోలో కనిపించాడు. అందులో ముందుగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు మ్యాథ్యూ హేడెన్‌, మైకెల్‌ హస్సీను ఓప్​నర్​లుగా ఎంచుకున్నాడు. తర్వాత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, రవింద్ర జడేజా, హర్భజన్, లక్ష్మీపతి బాలాజీ, డ్వేన్ బ్రావో, అల్బీ మోర్కెల్ ఇలా వరుసగా 10 మంది పేర్లు చెప్పాడు. ఇక 11వ ప్లేయర్​గా తన పేరును చెప్పుకొని.. కెప్టెన్​గా ధోనీని ఎంచుకున్నాడు దూబె.

అయితే దూబె వీడియోకు స్పందించిన, సీఎస్​కే పేస్ బౌలర్ దీపక్ చాహర్.. "వచ్చే సంవత్సరం నువ్వు (దూబె) బౌలర్​గా ఆడితే.. మేమెక్కడికి వెళ్లాలి" అని కామెంట్ చేశాడు. "వచ్చే సీజన్​లో మనమిద్దరం ఒక ఓవర్​లో తలపడదాం. నీకు ఒక ఓవర్ నేను బౌలింగ్ చేస్తా.. నాకు నువ్వు ఒక ఓవర్ బౌలింగ్ చెయ్. అప్పుడు చూద్దాం.. ఎవరు జట్టులో ప్లేస్ దక్కించుకుంటారో" అని చాహర్ మరో కామెంట్ చేశాడు. "నీ కోసం ఇప్పుడే టీమ్​లో ప్లేస్ ఖాళీ చేస్తున్నా" అని దూబె, చాహర్ కామెంట్​కు రిప్లై ఇచ్చాడు. మళ్లీ చాహర్.. చోటు కాదు, మ్యాచే కావాలనగా.. సరే అలాగే అంటూ దూబె సమాధానమిచ్చాడు.

16వ సీజన్​ ఐపీఎల్​లో దూబె అద్భుతంగా రాణించాడు. 14 ఇన్నింగ్స్​ల్లో 3 అర్ధ శతకాలు సహా.. 159 స్ట్రైక్ రేట్​తో 411 పరుగులు చేసి చెన్నై జట్టులో కీలకంగా మారాడు. అయితే ఈ సీజన్​లో 12 ఫోర్లు బాదిన దూబె.. 35 సిక్సులు బాదడం విశేషం. మరోవైపు పేసర్ చాహర్ కూడా 13 వికెట్లతో రాణించాడు. కాగా ఈ సీజన్​లో చెన్నై టైటిల్ గెలిచింది.

ABOUT THE AUTHOR

...view details