తెలంగాణ

telangana

'ఫినిషర్‌గా ఆడేందుకు సిద్ధమవ్వాలని అప్పుడే నాకు చెప్పారు.. అందుకే..'

By

Published : Oct 12, 2022, 6:40 AM IST

అవసరమైతే ఫినిషర్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉండాలంటూ సంవత్సరం క్రితమే తనకు ఆదేశాలు అందాయని టీమ్​ఇండియా వికెట్ కీపర్​, బ్యాటర్​ సంజూ శాంసన్​ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి చవిచూసినా.. ఫినిషర్‌గా శాంసన్‌ మంచి మార్కులే కొట్టేశాడు.

batter sanju samson said about doing finishing role for india
batter sanju samson said about doing finishing role for india

Sanju Samson: దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి చవిచూసినా.. ఫినిషర్‌గా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మంచి మార్కులే కొట్టేశాడు. జట్టును గెలిపించడానికి 30 పరుగులు అవసరమవ్వగా చివరి వరకు పోరాడి 19 పరుగులు అందించగలిగాడు. అయితే జట్టులో ఫినిషర్‌ పాత్ర తనకు ఒక్కసారిగా వచ్చింది కాదని అందుకోసం రెండేళ్ల నుంచే కసరత్తులు మొదలైనట్టు తెలిపాడు.

"అవసరమైతే ఫినిషర్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉండాలంటూ సంవత్సరం క్రితమే నాకు ఆదేశాలు అందాయి. అందుకే టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పటికీ అన్ని రకాల ఆర్డర్లను ప్రాక్టీస్‌ చేశాను. రెండేళ్లపాటు ఆటను ఆర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాను. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకున్నాను. గత అనుభవాలను పరిశీలించాను" అంటూ తెలిపాడు.

తొలి మ్యాచ్‌ ఫలితం అనంతరం జట్టు కెప్టెన్‌, కోచ్‌, యాజమాన్యం ఇలా అందరూ తమను వెన్ను తట్టి ప్రోత్సహించారని, తర్వాతి మ్యాచ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారని సంజూ వివరించాడు. ప్రతిభ ఉన్నా ప్రపంచ జట్టుకి ఎంపిక చేయలేదంటూ బీసీసీఐపై ఈ యువ ఆటగాడి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:ఐపీఎల్​ ఛైర్మన్ వద్దు.. బీసీసీఐ అధ్యక్ష పదవే ముద్దు!

మల్టీప్లెక్స్​లలో ​వరల్డ్ కప్​ మ్యాచ్​ల లైవ్.. ఏ ప్రాంతాల్లో అంటే?

ABOUT THE AUTHOR

...view details