తెలంగాణ

telangana

'గార్డ్ ఆఫ్ ఆనర్'తో టేలర్​కు వీడ్కోలు.. వీడియో వైరల్

By

Published : Jan 10, 2022, 3:32 PM IST

Ross Taylor gaurd of honour, రాస్ టేలర్ గార్డ్ ఆఫ్ ఆనర్
Ross Taylor

Taylor Guard of Honour: కెరీర్​లో తన చివరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్​కు 'గార్డ్ ఆఫ్ ఆనర్​' అందించారు బంగ్లాదేశ్ ఆటగాళ్లు. అతడు బ్యాటింగ్​కు వస్తుండగా మైదానంలోని ప్రేక్షకులు కూడా నిల్చొని చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

Taylor Guard of Honour: న్యూజిలాండ్‌ సీనియర్ బ్యాటర్ రాస్‌ టేలర్‌కు తన చివరి టెస్టులో ప్రత్యర్థి జట్టు నుంచి అద్భుత గౌరవం దక్కింది. సోమవారం రెండో టెస్టులో అతడు క్రీజులోకి వస్తుండగా హాగ్లే ఓవల్‌ మైదానంలోని ప్రేక్షకులు నిల్చొని చప్పట్లతో స్వాగతం పలికారు. కాగా, మైదానంలోని బంగ్లా ఆటగాళ్లు కూడా రెండు వరుసల్లో నిల్చొని టేలర్‌కు 'గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌' అందించారు.

బంగ్లా ఆటగాళ్లు టేలర్​కు ఘన స్వాగతం పలికిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. వారి క్రీడాస్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. టేలర్‌ గతేడాది డిసెంబర్‌ 30న త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఈ బంగ్లాదేశ్‌ సిరీసే టెస్టుల్లో తనకు చివరిదని.. ఆపై ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ జట్లపై చివరిసారి పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆటగాళ్లు అతడికి ఘన వీడ్కోలు పలికారు.

భారీ ఆధిక్యంలో కివీస్

తన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 28 పరుగులు చేశాడు టేలర్. కెప్టెన్ లాథమ్ అద్భుత డబుల్ సెంచరీ (252)కి తోడు కాన్వే (109) సెంచరీతో కదంతొక్కడం వల్ల తొలి ఇన్నింగ్స్​ను న్యూజిలాండ్‌ 521/6 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్.. 126 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. దీంతో 395 పరుగుల వెనుకంజలో నిలిచిన బంగ్లా ఇప్పుడు ఫాలోఆన్‌ ఆడే పరిస్థితుల్లో నిలిచింది. దీంతో టేలర్‌ ఇక టెస్టుల్లో మరోసారి బ్యాటింగ్‌ చేసే వీలు లేనట్లు కనిపిస్తోంది.

ఇవీ చూడండి: 'డిసెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్' ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details