తెలంగాణ

telangana

పాకిస్థాన్​కు షాక్.. ఆ దేశం నుంచి ఆసియా కప్​ ఔట్.. యూఏఈ ఆతిథ్యం?

By

Published : Feb 5, 2023, 7:20 AM IST

ఆసియా కప్‌కు యూఏఈ వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఏసీసీ ఛైర్మన్‌ జై షా, పీసీబీ అధ్యక్షుడు నజామ్‌ సేథీ టోర్నీని యూఏఈకి మార్చే విషయం గురించి చర్చించారు.

asia cup 2023
asia cup 2023

ఆసియా కప్‌ టోర్నీకి యూఏఈ వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) సమావేశంలో ఛైర్మన్‌ జై షా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజామ్‌ సేథీ టోర్నీని యూఏఈకి మార్చే విషయం గురించి చర్చించారు. వేదికను మార్చిలో ఖరారు చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది.

కానీ ఈ టోర్నీలో ఆడేందుకు పాక్‌కు వెళ్లమని నిరుడు అక్టోబర్‌లో బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్‌ ఆడకుంటే.. టోర్నీ నిర్వహించినా పాకిస్థాన్‌కు ఎలాంటి ఆదాయం లభించకపోచ్చు. భారత్‌ సహా అన్ని దేశాలతో తటస్థ వేదికలో టోర్నీ నిర్వహించినా ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి గ్రాంటు లభిస్తుంది. ప్రస్తుతం తమ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో యూఏఈలో టోర్నీని నిర్వహించడం ద్వారా ప్రసార హక్కుల ఆదాయాన్ని పొందొచ్చని పాక్‌ బోర్డు యోచిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details