తెలంగాణ

telangana

Asia Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్​.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదయ్యా!

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 7:25 PM IST

Asia Cup 2023 Ind vs Pak Match Empty Stadium : 2023 ఆసియ కప్​ సూపర్​ 4 లో భాగంగా కొలంబో వేదికగా నేడు సెప్టెంబర్ 10న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్​లో ఎన్నడూ జరగని ఓ పరిస్థితి ఏర్పడింది. ఇది చూసిన అభిమానులు చింతిస్తున్నారు. ఆ వివరాలు..

Asia Cup 2023 : భారత్ - పాక్ మ్యాచ్​.. ఇలాంటి దుస్థితి ఎప్పుడూ లేదయ్యా!
Asia Cup 2023 : భారత్ - పాక్ మ్యాచ్​.. ఇలాంటి దుస్థితి ఎప్పుడూ లేదయ్యా!

Asia Cup 2023 Ind vs Pak Match Empty Stadium : ఆసియా కప్‌-2023 భాగంగా కొలొంబో వేదికగా నేడు సెప్టెంబర్ 10న టీమ్​ఇండియా-భారత్​ సూపర్‌ ఫోర్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్​.. టీమ్​ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పాక్‌ అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56), శుభ్‌మన్‌ గిల్‌ (58) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించి టీమ్​ఇండియాకు మంచి శుభారంభాన్ని అందించారు.

ఈ ఇద్దరు ఓపెనర్లు.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఔట్​ అయ్యారు. తర్వాత క్రీజులోకి కోహ్లీ, కేఎల్ రాహుల్ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే 24 ఓవర్ల తర్వాత వర్షం వల్ల మ్యాచ్​కు అంతరాయం కలిగింది. దీంతో అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కానీ ఆ తర్వాత వర్షం తగ్గాక ఓవర్లను కుదించి మ్యాచ్​ను పునఃప్రారంభించారు. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా ఎన్నడూ లేని పలు ఆసక్తికర దృశ్యాలు కనపడ్డాయి. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే స్టేడియాలు క్రికెట్ ప్రేమికులతో నిండిపోతాయి. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు. స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించింది. ఈ దృశ్యాలు టీవీ చూస్తున్న క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. షాక్​కు గురి చేశాయి.

India Vs Pak Match Rain Update : ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ వేదిక స్టేడియంలో 15000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అందింది. క్రికెట్‌ హిస్టరీలో ఇదే పెద్ద షాకింగ్‌ విషయమనే చెప్పాలి. మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది సేపు క్రితం టికెట్ల రేట్లు తగ్గించినా కూడా ప్రేక్షకులు టికెట్లు కొనడానికి ఆసక్తి చూపలేదట. ఈ పరిస్థితి అంతటికీ ప్రధాన కారణం వర్షమే. దీని వల్లే ప్రేక్షకులు మైదానానికి రాలేకపోతున్నారు. ఏదేమైనా యావత్‌ క్రీడా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన టీమ్​ఇండియా పాకిస్థాన్ మ్యాచ్​కు ఇలాంటి పరిస్థితి రావడంపై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్​ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్​దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ జట్టు..బాబార్ అజామ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రఫ్, నజీమ్ షా, షహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్

Asia Cup 2023 Pak vs Bangladesh : 'టోర్నీమొత్తం చీకటిలో నిర్వహించేవారా?'.. PCBపై క్రికెట్ ఫ్యాన్స్ గరం!

Asia Cup 2023 Sl vs Ban : సూపర్​ 4 లో శ్రీలంక శుభారంభం.. రెండో ఓటమితో బంగ్లా ఫైనల్ ఆశలు సంక్లిష్టం!

ABOUT THE AUTHOR

...view details