తెలంగాణ

telangana

Ashes 2021: రెండో టెస్టూ ఆసీస్​దే.. ఇంగ్లాండ్​కు తప్పని ఓటమి

By

Published : Dec 20, 2021, 3:26 PM IST

Ashes 2021:యాషెస్ సిరీస్​లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ కావడం వల్ల.. 275 పరుగుల తేడాతో విజయం సాధించింది కంగారూ జట్టు.

Ashes 2021 2nd testm australia beat england,, యాషెస్ 2021, ఇంగ్లాండ్​పై ఆస్ట్రేలియా విజయం
Ashes 2021

Ashes 2021: యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపు మీదున్న కంగారూ జట్టు.. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్​ను ఓడించింది. 275 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 9 వికెట్ల నష్టానికి 473 పరుగులకు డిక్లేర్ చేసింది. లబుషేన్ (103) అద్భుత శతకంతో సత్తాచాటగా.. వార్నర్ (95), స్మిత్ (93) గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. కారే (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ను 236 పరుగులకే కట్టడి చేసింది కంగారూ జట్టు. స్టార్క్ (4/37), లియోన్ (3/58) విజృంభించడం వల్ల ఇంగ్లీష్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. మలన్ (80), రూట్ (62) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. దీంతో ఆసీస్​కు తొలి ఇన్నింగ్స్​లో 237 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 230 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. లబుషేన్ (51) అర్ధశతకంతో మెరిశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో 468 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు చివరి రోజైన సోమవారం డ్రా కోసం పోరాడింది. బట్లర్ (26, 207 బంతుల్లో), వోక్స్ (44) ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో 192 పరుగులకు ఆలౌటై.. ఆసీస్​కు విజయాన్ని అప్పగించింది ఇంగ్లాండ్. ఆసీస్ బౌలర్లలో జే రిచర్డ్​సన్ 5 వికెట్లతో సత్తాచాటాడు.

ఇవీ చూడండి: ప్రేక్షకులు లేకుండానే భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్!

ABOUT THE AUTHOR

...view details