తెలంగాణ

telangana

World Badminton Championship: నేడే సెమీస్‌- చరిత్ర సృష్టించేదెవరో?

By

Published : Dec 18, 2021, 6:55 AM IST

World Badminton Championship 2021: స్పెయిన్​ వేదికగా జరుగుతున్నబ్యాడ్మింటన్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భాగంగా శనివరాం సెమీఫైనల్స్​ జరగనున్నాయి. భారత్​ తరపున శ్రీకాంత్​, లక్ష్యసేన్​ సెమీస్​లో ముఖాముఖి తలపడనున్నారు.

srikanth kidambi
నేడే ప్రపంచ ఛాంపియన్​షిప్​ సెమీస్‌

World Badminton Championship 2021: ఒక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు పురుష షట్లర్లు పతకాలు ఖాయం చేయడంతోనే భారత బ్యాడ్మింటన్‌లో కొత్త రికార్డు నమోదైంది. ఇక శనివారం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే ఆటగాడెవరో చూడాలి. ఇప్పటిదాకా భారత పురుష షట్లర్లకు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌ చేరడమే ఉత్తమ ప్రదర్శన. 1983లో ప్రకాశ్‌ పదుకొనె, 2019లో సాయిప్రణీత్‌ ఈ ఘనత సాధించారు.

ఈసారి క్వార్టర్స్‌ దాటిన శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ సెమీస్‌లో ముఖాముఖి తలపడుతుండటం వల్ల వారిలో ఒకరు ఫైనల్‌ చేరి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నట్లే. సెమీస్‌లో ఓడిన ఆటగాడు కాంస్యంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. గెలిచిన ఆటగాడికి కనీసం రజతం, అన్నీ కలిసొస్తే స్వర్ణం కూడా సొంతం కావచ్చు. ఫామ్‌, అనుభవం ప్రకారం చూస్తే శ్రీకాంత్‌కే ఫైనల్‌ చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

ఇదీ చూడండి :Asian Champions Trophy: పాక్​ను చిత్తుచేసిన భారత జట్టు

ABOUT THE AUTHOR

...view details