తెలంగాణ

telangana

20 నెలల తర్వాత దేశవాళీ బ్యాడ్మింటన్ పోటీలు

By

Published : Nov 10, 2021, 4:14 PM IST

దేశవాళీ బ్యాడ్మింటన్ పోటీలకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల నుంచి ఇవి మొదలుకానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా రెండు టోర్నీలు జరగనున్నాయి.

badminton
బ్యాడ్మింటన్

కొవిడ్ కారణంగా వాయిదా పడిన దేశవాళీ బ్యాడ్మింటన్ పోటీలు(Domestic Badminton) వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 20 నెలల విరామం తర్వాత ఇవి తిరిగి మొదలవుతాయని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(BAI News) పేర్కొంది. తొలి టోర్నీ డిసెంబర్ 16-22 మధ్య చెన్నై వేదికగా జరగనున్నట్లు స్పష్టం చేసింది.

తొలి టోర్నీ తర్వాత డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్​లో మరో లెవల్​ 3 టోర్నీ కూడా జరగనుందని బీఏఐ(Domestic badminton tournaments in india) పేర్కొంది. రెండు టోర్నీలకు రూ. 10 లక్షలు క్యాష్​ ప్రైజ్ ఉందని తెలిపింది.

చెన్నై టోర్నీకి నవంబర్ 24లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, హైదరాబాద్ టోర్నీకి డిసెంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే.. దేశవాళీ బ్యాడ్మింటన్ టోర్నీలను కొవిడ్ నిబంధనల మధ్యే నిర్వహిస్తామని తెలిపారు బీఏఐ సెక్రటరీ అజయ్ కే సింగనియా. టోర్నీల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేయించుకుని నెగటివ్​ రిపోర్టు తీసుకురావాలని స్పష్టం చేశారు.

సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో మూడు భాగాలుంటాయి.

  • లెవల్ 3, బీఏఐ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ(ఏడాదిలో ఆరు సార్లు)
  • లెవల్ 2, బీఏఐ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ(ఏడాదిలో నాలుగు సార్లు)
  • లెవల్ 1, బీఏఐ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ(ఏడాదిలో రెండు సార్లు)

ఈ మొత్తం దేశవాళీ సీనియర్​ ర్యాంకింగ్ టోర్నీల్లో రూ. 2.2 కోట్లు ప్రైజ్​మనీ ఉంటుంది. లెవల్​ 3 టోర్నీకి రూ. 10 లక్షలు, లెవల్​ 2 టోర్నీకి రూ. 15 లక్షలు, లెవల్​ 1 టోర్నీకి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. ఈ టోర్నీల అనంతరం జాతీయ స్థాయి పోటీలు​ జరుగుతాయి. దీనికి రూ. 50 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది.

ఇదీ చదవండి:

Covid Effect: కీలక బ్యాడ్మింటన్​ టోర్నీలు రద్దు

Pv Sindhu: చీరకట్టులో పీవీ సింధు.. అభిమానులు ఫిదా

ABOUT THE AUTHOR

...view details