తెలంగాణ

telangana

ప్రకాశ్​ పదుకొణెకు జీవిత సాఫల్య పురస్కారం

By

Published : Nov 18, 2021, 7:12 PM IST

భారత దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెను (Prakash Padukone Badminton) మరో అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది (BWF News) ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య.

prakash padukone badminton
బ్యాడ్మింటన్

భారత దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణెకు (Prakash Padukone Badminton) జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్​). అవార్డు కమిషన్ సిఫార్సుల మేరకు ఆయన పేరును ఖరారు చేసింది (BWF News) బీడబ్ల్యూఎఫ్. ఈ అవార్డు కోసం ప్రకాశ్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) ప్రతిపాదించింది.

ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న ప్రకాశ్.. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో పతకం సాధించిన తొలి భారత షట్లర్. ఆట కోసం ఆయన ఎన్నో సేవలందించారు. ఈ నేపథ్యంలోనే 2018లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది (BAI News) భారత బ్యాడ్మింటన్ సంఘం.

మెరిటోరియస్ సర్వీస్ అవార్డు (Badminton News) కోసం దేవేందర్ సింగ్, ఎస్​ఏ శెట్టి, డా.ఓడీ శర్మ, మానిక్ సాహా పేర్లను నామినేట్ చేసింది బీడబ్ల్యూఎఫ్ మండలి. ఉత్తరాఖండ్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షురాలు అలకనంద అశోక్​కు.. ఉమెన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అవార్డును ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి:స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్​ జీవిత కథతో పుస్తకం

ABOUT THE AUTHOR

...view details