తెలంగాణ

telangana

Perni Nani Comments On RGV: 'సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు'

By

Published : Jan 5, 2022, 10:18 AM IST

Perni Nani Comments On RGV: సినిమా టికెట్ల ధరలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రూ.100 టికెట్​ను వెయ్యి, 2 వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. డిమాండ్, సప్లయ్‌ అంటారా.. లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని నిలదీశారు. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

Perni Nani Comments On RGV
ఏపీ మంత్రి పేర్ని నాని

Perni Nani Comments On RGV: దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్వీట్లపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టికెట్ల విషయంపై ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందన్న వర్మ ప్రశ్నకు100 రూపాయల టికెట్‌ను వెయ్యికి, 2 వేలకు అమ్మొచ్చని ఏ చట్టం చెప్పిందని పేర్ని నాని ట్వీట్ చేశారు. ఇలా చేయడాన్ని ఏ తరహా మార్కెట్ మెకానిజం అంటారని ప్రశ్నించారు. డిమాండ్, సప్లయ్‌ అంటారా....లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని నిలదీశారు. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

ప్రోత్సాహం తగ్గేది కొనేవారికా? అమ్మేవారికా?

66 ఏళ్లుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయని స్పష్టం చేశారు. వర్మ నిత్యావసరాల ధరల్నే ప్రభుత్వం నియంత్రించవచ్చని సూచించారన్న పేర్ని... సినిమా థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలని బదులిచ్చారు. బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గేది కొనేవారికా.. లేక అమ్మేవారికా? అని ప్రశ్నించారు.

నిర్మాతల శ్రేయస్సు తప్ప ప్రేక్షకుల గురించి ఆలోచించరా అంటూ ట్వీట్ చేశారు. సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగాగానీ భావించట్లేదని స్పష్టం చేశారు. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌, సినిమాకు ఖర్చు చూసి ఏ ప్రభుత్వమూ ధర నిర్ణయించదని చెప్పుకొచ్చారు. సినిమా ఒక వస్తువు కాదు వినోద సేవ మాత్రమేనని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి:'ఇండస్ట్రీకి పెద్ద దిక్కు' వ్యవహారంపై ఆర్జీవీ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details