Acharyam movie teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య'(chiru acharya movie). రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. నవంబరు 28న రామ్‌చరణ్ సన్నివేశాలకు సంబంధించిన చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal in acharya), రామ్‌చరణ్‌కు(ram charan pooja hegde new movie) జోడీగా పూజా హెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: రష్మికి బంపర్ ఆఫర్.. చిరుతో కలిసి మాస్ సాంగ్‌లో!