తెలంగాణ

telangana

ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ..: హీరో చిరంజీవి

By

Published : Jan 2, 2022, 12:16 PM IST

Updated : Jan 2, 2022, 1:44 PM IST

chiranjeevi
చిరంజీవి ()

Chiranjeevi news: ఇండస్ట్రీలో పెద్దగా ఉండనని, ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఇండస్ట్రీ వర్కర్స్​కు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.

పెద్దరికం అనే హోదా తనకు ససేమిరా ఇష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పెద్దగా ఉండను కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్​లో జూబ్లీహిల్స్​లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి 50 శాతం రాయితీతో హెల్త్ కార్డుల పంపిణీ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు.. కళామతల్లికి తోబుట్టువులుగా భావించి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్​ల్లో పాల్గొనాలని సూచించారు.

మెగాస్టార్ చిరంజీవి

"పెద్దరికం అనే హోదా నాకు ససేమిరా ఇష్టం లేదు. పెద్దగా ఉండను కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుకొస్తాను. అనవసరమైనవాటికి తగుదునమ్మా అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదు. అవసరమైనప్పుడు నా భుజం కాయలనుకున్నప్పుడు వస్తాను. ఇద్దరు కొట్టుకుంటే తగువు తీర్చమంటే తీర్చను. ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటాను" అని చిరంజీవి చెప్పారు.

'ఆచార్య' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన అగ్రకథానాయకుడు చిరంజీవి.. గాడ్​ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలోనూ సినిమా షూటింగ్​ల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 2, 2022, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details