ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసిన చిత్రబృందం.. ప్రస్తుతం ఓ అదిరిపోయే సాంగ్‌ను షూట్ చేస్తోంది. ఈ పాటను 1000 మంది డ్యాన్సర్లతో రూపొందిస్తుండటం విశేషం. దీపావళి కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. ఈ పాట థియేటర్లలో మాస్ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టిస్తుందని వెల్లడించింది.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'సామి సామి' (pushpa songs update), 'దాక్కో దాక్కో మేక'(pushpa dakko dakko meka song), 'శ్రీవల్లి' పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రష్మిక హీరోయిన్. కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు(pushpa movie music director). మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది.