తెలంగాణ

telangana

ఆండ్రాయిడ్​లో అదిరే ఫీచర్లు- డిజిటల్​ కార్​ కీ, సరికొత్త విడ్జెట్లు ఇంకెన్నో..

By

Published : Dec 3, 2021, 1:11 PM IST

Android features: గూగుల్​ నుంచి సరికొత్త ఫీచర్లు వచ్చేశాయి. ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం కొత్త అప్​డేట్స్​ విడుదల చేసింది సంస్థ​. ఇందులో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.

Google announces new Android features
ఆండ్రాయిడ్​లో కొత్త ఫీచర్లు

Android features: ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌ కోసం గూగుల్​ సరికొత్త అప్​డేట్స్​ను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లతో పాటు ఇతర వినియోగదారుల కోసం డిజిటల్‌ కార్‌ కీ, కొత్త విడ్జెట్లు, గూగుల్‌ ఫోన్స్‌లో మెమొరీలు, అప్‌డేటెడ్‌ ఎమోజీ కిచెన్‌, ప్రైవసీ టూల్‌ ఫీచర్లు ఈ అప్‌డేట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Digital Car Key Functionality

యాపిల్‌ కార్‌కీ తరహాలో డిజిటల్‌ కార్ కీ తీసుకువస్తున్నట్లు గూగుల్​ ప్రకటించింది. ఈ కీ ద్వారా జేబుల్లోంచి స్మార్ట్‌ ఫోన్‌ బయటకు తీయకుండానే కారును అన్‌లాక్‌ చేసే వీలు ఉంటుంది. బీఎండబ్ల్యూ కార్లకు పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో, శాంసంగ్​ గెలాక్సీ ఎస్​21 ఫోన్​ యూజర్లు మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్​ను ఉపయోగించవచ్చు

అయితే ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Family Bell Feature

రోజువారీ షెడ్యూల్స్‌కు సంబంధించి వినియోగదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ బెల్​ అనే కొత్త టూల్‌ను ఆండ్రాయిడ్ పరిచయం చేయనుంది.

దీని ద్వారా ముఖ్యమైన టాస్క్‌లకు సంబంధించి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయవచ్చు.

హాలిడేస్​లో మొక్కలకు నీళ్లు పోయడం, ఫ్యామిలీతో సినిమాకు వెళ్లడం వంటి ఇతర ఇంటి పనులకు సంబంధించి ఈ ఫీచర్​ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది.

ఆ అలర్ట్స్​ ఫోన్​, హోం స్పీకర్లు, స్మార్ట్​ డిస్​ప్లేల ద్వారా వస్తాయి.

Google Apps are Getting New Widgets

గూగుల్​ యాప్స్​లో సరికొత్త విడ్జెట్లు అందుబాటులోకి రానున్నాయి.

  • గూగుల్​ ప్లే బుక్స్​ విడ్జెట్​ యూజర్లకు ఫుల్​ లైబ్రరీని యాక్సెస్​ చేసుకొనే అవకాశం కల్పిస్తుంది.
  • యూట్యూబ్​ మ్యూజిక్​ విడ్జెట్​.. ప్లేబ్యాక్​ కంట్రోల్స్​, రీసెంట్లీ ప్లేయ్​డ్​ ట్రాక్స్​ను ఇప్పుడు హోం స్క్రీన్​పైనే ఉంచుతుంది.
  • గూగుల్‌ ఫొటోస్‌కు మెమొరీ ఆప్షన్‌ రాబోతుంది. ఇది లైబ్రరీలో ఫొటోలను ఆటోమెటిక్​గా క్యూరేట్‌ చేస్తుంది. ఈ ఫీచర్ వచ్చే వారంలో అందుబాటులోకి వస్తుంది.

Android Updates

మీడియా యాప్స్‌లో నచ్చిన మ్యూజిక్‌ను వేగంగా సర్చ్‌ చేసేందుకు ఆండ్రాయిడ్‌ ఆటో ద్వారా వాయిస్ సర్చ్‌ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

అప్‌డేటెడ్‌ ఎమోజీ కిచెన్‌ కూడా ఆండ్రాయిడ్‌ 12 ఫీచర్లలో ఉండనుంది.

పిక్సెల్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉండే జీబోర్డ్‌ కీ బోర్డు ద్వారా రెండు ఎమోజీలను మిక్స్‌ చేసుకునే వెసులుబాటును సరికొత్త ఎమోజీ కిచెన్‌ అందిస్తుంది. జీ బోర్డ్​ బీటా యూజర్లు ఇది ఇప్పటికే వినియోగిస్తున్నారు.

మిగతావారి కోసం.. ఈ అప్‌డేట్స్‌ రానున్న వారాల్లో మొదలుకానున్నాయి.

ఇవీ చూడండి:'మోటో వాచ్​ 100' ఫొటోలు లీక్​.. అదిరే ఫీచర్లు!

స్మార్ట్​ఫోన్​లో మీకే తెలియని ఫీచర్ల కోసం అదిరే యాప్​లు

ABOUT THE AUTHOR

...view details