తెలంగాణ

telangana

రూ.500కే అమెజాన్​ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌!

By

Published : Jun 1, 2021, 6:03 PM IST

ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​ మరో ఆఫర్​తో వినియోగదారుల ముందుకు వచ్చింది. అమెజాన్​ ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​​పై సగానికి పైగా రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది.

Amazon Prime, Prime Subscription
ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌

యూత్‌ను ఆకట్టుకోవడానికి మరో కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌. కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే 18-24 మధ్య ఉన్న వయసు గల వారికి 50శాతం రాయితీ అందిస్తోంది. ఏడాది, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ప్రైమ్‌ వీడియో, మ్యూజిక్‌, ఫ్రీ డెలివరీ వంటి సదుపాయాలను పొందేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు.. ఏడాదికి రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలల కాలానికి రూ.329 చెల్లించాలి. యూత్‌ ఆఫర్‌ కింద దీన్ని సగం ధరకే పొందాలంటే యూజర్‌.. ఆధార్‌/పాన్‌/ ఓటర్‌ ఐడీ/ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వాటిల్లో ఏదైనా గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీని కూడా పంపించాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్‌ పూర్తయ్యాక 48గంటల్లోపు రూ. 500 క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ కింద ఖాతాలో జమ అవుతుంది. అదే మూడు నెలల ప్లాన్‌ తీసుకునే వారికి రూ.165 వస్తుంది. దీన్ని రీఛార్జీలు, అమెజాన్‌లో ఇతర కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా మొబైల్‌ యాప్‌/ బ్రౌజర్‌లో యాక్టివేట్‌ చేసుకున్న వారికి మాత్రమేనని అమెజాన్‌ పేర్కొంది. డెస్క్‌టాప్‌ లేదా ఐవోఎస్‌ యాప్‌ వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తించదు.

ఇదీ చూడండి:ఇకపై విద్యుత్​ వాహనాలకు ఆర్​సీ ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details