తెలంగాణ

telangana

'సొరకాయ హల్వా' రెసిపీ చూసేయండి..

By

Published : Sep 20, 2020, 1:01 PM IST

సొరకాయలో నీటి శాతం అధికం. బరువు తగ్గడానికి ఇదో చక్కటి ఆహారం. అయితే.. సొరకాయను అట్టే తినడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటివారు ఓ సారి సొరకాయ హల్వా ట్రై చేయాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం రండి....

try sorkaya halwa or  bottle gauard halwa recipe in telugu
'సొరకాయ హల్వా'తో ఆరోగ్యం వారెవ్వా!

పిల్లా పెద్దా ఎంతో ఇష్టంగా ఆరగించే సొరకాయ హల్వా చేసుకోవడం ఎంత ఈజీయో చూసేయండి...

కావాల్సినవి

సొరకాయ తురుము- కప్పు

పాలు- రెండు కప్పులు

పంచదార- కప్పు

యాలకులపొడి- కొద్దిగా

పచ్చ రంగు ఫుడ్‌కలర్‌- కొద్దిగా

తయారీ విధానం

సొరకాయకు ప్రత్యేకమైన రుచి అంటూ ఉండదు. మనం అందులో ఏ పదార్థాలు కలిపితే ఆ రుచిని, పరిమళాన్ని ఆపాదించుకుంటుంది. సొరకాయ తురుముని నెయ్యిలో వేయించుకుని పంచదార, చిక్కని పాలు వేసి దగ్గరగా అయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. చివరిగా యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసుకోవాలి. చివర్లో కొద్దిగా కండెన్స్‌డ్‌ మిల్క్‌ లేదా మిల్క్‌మెయిడ్‌ కలుపుకోవచ్చు. ఇష్టముంటే కోవా కూడా.

ఇదీ చదవండి:అమ్మ చేతి 'డ్రైఫ్రూట్స్‌ లడ్డు'.. ఆరోగ్యానికి వెరీగుడ్డు

ABOUT THE AUTHOR

...view details