తెలంగాణ

telangana

'కొబ్బరి పాల పాయసం' సింపుల్ రెసిపీ!

By

Published : Sep 27, 2020, 1:30 PM IST

అనాదిగా మన సంబరాలను, సంతోషాలను పంచుకుంటూ వస్తోంది పాయసం. అయితే, ఆనందాలను ఆరోగ్యంగా ఆస్వాదించాలంటే మాత్రం 'కొబ్బరి పాల పాయసం' చేసుకోవాల్సిందే. మరింకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి...

kobbari-paala-payasam-or-coconut-rice-puddig-at-home
'కొబ్బరి పాల పాయసం' సింపుల్ రెసిపీ!

కొబ్బరిలోని సద్గుణాలను ఏనాడో గుర్తించారు మన పూర్వీకులు. అందుకే, కొబ్బరిని మన వంటకాల్లో భాగం చేశారు. మరి అంతటి ఆరోగ్యాన్నిచ్చే కొబ్బరితో తియ్యటి పాయసం చేసుకుంటే ఆ మజానే వేరు కదూ.... !

కావాల్సినవి

తాజా కొబ్బరి తురుము - కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, పాలు - అరకప్పు, బియ్యం - రెండు చెంచాలు, యాలకులపొడి - అరచెంచా, నెయ్యి - చెంచా, బాదం - కొన్ని.

తయారీ

బియ్యాన్ని రెండు గంటలముందు నానబెట్టుకోవాలి. తరవాత బియ్యం, కొబ్బరి తురుమూ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఓ గిన్నెలో ఈ మిశ్రమం తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఇది కాస్త ఉడుకుతున్నప్పుడు చక్కెరా, పాలూ పోసి కలపాలి. పాయసం కాస్త చిక్కగా అవుతున్నప్పుడు యాలకుల పొడీ, నేతిలో వేయించిన బాదం పలుకులు వేసి దింపేయాలి.

ఇదీ చదవండి:రుచితో మనసు నింపే 'సలాడ్‌ నిక్వా' రెసిపీ!

ABOUT THE AUTHOR

...view details