తెలంగాణ

telangana

పెసర పునుగుల పులుసు.. రుచి చూశారా?

By

Published : Aug 3, 2021, 4:00 PM IST

మనం ఎన్నో రకాల పులుసులు తింటుంటాం. మరి అందులో పెసర పునుగుల పులుసు గురించి తెలుసా? తింటే నోరూరాల్సిందే. దాన్ని తయారుచేసుకోండిలా..

pulusu
పులుసు

కావాల్సినవి: పెసర పునుగులు- పది, ఉల్లిపాయలు-రెండు, పచ్చిమిర్చి-నాలుగు, చింతపండు-నిమ్మకాయంత, వెల్లుల్లిరెబ్బలు-నాలుగు, జీలకర్ర-కొద్దిగా, నీళ్లు-రెండు కప్పులు, కొత్తిమీర-చిన్నకట్ట, పసుపు-పావుటీస్పూన్‌, కారం-రెండు టీస్పూన్లు, ఉప్పు-సరిపడా.

తయారీ: ముందుగా వెల్లుల్లి, జీలకర్రలను మెత్తగా పేస్టు చేసుకోవాలి. బాణలిలో నూనె పోసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసి నిమిషం పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో రెండు కప్పుల నీళ్లు పోసి అయిదు నిమిషాలు ఉడికించాలి. ఇందులో చింతపండు పులుసు పోసి పది నిమిషాలపాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇప్పుడు పెసర పునుగులు వేసి కూరను దించేయాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేయాలి.

పులుసు

ఇదీ చూడండి: పరాఠా కొత్త రుచులను ఆస్వాదిద్దామా?

ABOUT THE AUTHOR

...view details