తెలంగాణ

telangana

నోరూరించే 'బ్రెడ్‌ స్క్రాంబుల్‌' చిటికెలో చేసుకుందామిలా..!

By

Published : Oct 8, 2020, 1:01 PM IST

మన పాకశాలలో బ్రెడ్​తో బోలెడన్ని ప్రయోగాలే చేస్తుంటాం. బ్రెడ్‌ టోస్ట్, బటర్ బ్రెడ్‌ , మిల్క్ బ్రెడ్‌, బ్రెడ్ ఆమ్లెట్.. ఇలా ఒకటా రెండా అబ్బో.. లెక్కలేనన్ని. మరి అదే బ్రెడ్​తో ఎప్పుడైనా బుర్జి అదేనండి బ్రెడ్‌ స్క్రాంబుల్‌ చేసుకున్నారా? అయితే, ఈ రెసిపీ చూసి ఈ సారి తప్పక ప్రయత్నించండి..

easy bread scramble recipe at home in telugu
నోరూరించే 'బ్రెడ్‌ స్క్రాంబుల్‌' చిటెకెలో చేసుకుందామిలా..!

బ్రెడ్ ముక్కలను ముక్కలు ముక్కలుగా చేసి... నోరూరించే బ్రెడ్‌ స్క్రాంబుల్‌ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి మరి..

కావాల్సినవి..

బ్రౌన్‌ బ్రెడ్​ స్లైసులు - మూడు, ఉల్లిపాయలు - రెండు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), టొమాటో - ఒకటి (సన్నగా తరగాలి), కొత్తిమీర తురుము - కొద్దిగా, అల్లంవెల్లుల్లి ముద్ద - అర చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - పావు చెంచా, సోయాసాస్‌ - చెంచా, చిల్లీసాస్‌ - చెంచా, గుడ్లు - మూడు, నూనె - రెండు చెంచాలు.

తయారీ

మొదట బ్రెడ్‌ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు, పసుపు, సోయా, చిల్లీసాస్‌ వేసి బాగా కలపాలి. ఇందులో గుడ్ల సొన వేసి మరోసారి కలపాలి. తరువాత ఈ మిశ్రమంలోనే బ్రెడ్‌ ముక్కలను వేయాలి. బాణలిలో నూనె పోసి అది వేడయ్యాక ఈ మిశ్రమం వేసి పెద్దమంటపై కాసేపటి దాకా బాగా వేయించాలి. దీన్ని ఉదయం అల్పాహారంగానే కాదు, నచ్చినప్పుడు తీసుకోవచ్చు. చేసుకోవడమూ సులువే.

ఇదీ చదవండి:కమ్మగా 'బ్రెడ్‌దోశ'.. చిటికెలో తయారవ్వగా!

ABOUT THE AUTHOR

...view details