తెలంగాణ

telangana

ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

By

Published : Oct 11, 2020, 7:54 PM IST

నాన్​-వెజ్​ తినాలనిపిస్తే చాలు.. సాధారణంగా అందరి చూపూ చికెన్​వైపే. అందులోనూ పులుసు, వేపుడు వంటకాల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. అయితే.. చికెన్​కు కాస్తంత తోటకూర జోడించి వండేస్తే.. ఎంచక్కా రుచికరమైన 'తోటకూర చికెన్'​ రెడీ. తయారీ విధానం ఎలాగో మీరే తెలుసుకోండి..

COOKING ASPARAGUS CHICKEN IN NON VEG ITEMS
ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

చికెన్​తో ఎప్పుడూ పులుసు, వేపుడు వంటకాలే కాకుండా.. ఇలా వెరైటీగా తోటకూర చికెన్​ కూడా చేస్కోవచ్చు.

తోటకూర చికెన్​

కావాల్సినవి:

  • చికెన్‌- పావుకిలో
  • తోటకూర తరుగు- రెండుకప్పులు
  • ఎండుమిర్చి- నాలుగు
  • దంచిన ధనియాలు- చెంచా
  • కారం- చెంచా
  • పసుపు- చెంచా
  • ఉప్పు- తగినంత
  • కొబ్బరికోరు- పావుకప్పు
  • నూనె- తగినంత
  • ఉల్లిపాయలు- రెండు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌- చెంచా

తయారీ విధానం:

కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఎండుమిర్చి, ధనియాల పొడి వేయాలి. అవి వేగాక అందులో ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించాలి. ఇందులో చికెన్‌, కారం, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లుపోసి మాంసాన్ని ఉడికించుకోవాలి. అప్పుడు తోటకూరని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. తోటకూర ఉడికి నీరంతా పోయిన తర్వాత చివరిగా కొబ్బరికోరు వేసి దింపుకోవాలి.

ఇదీ చదవండి:రెండేళ్లకే అంకెలతో ఆడేసుకుంటున్న బుడతడు

ABOUT THE AUTHOR

...view details