తెలంగాణ

telangana

జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి!

By

Published : Apr 21, 2021, 1:00 PM IST

ఎండ రోజురోజుకీ పెరిగిపోతోంది. వేడి కొందరి జుట్టును జిడ్డుగా మారుస్తుంది. దీనికి కాలుష్యం, దుమ్మూ జతైతే మరిన్ని సమస్యలు. అందుకే అందుబాటులో ఉండే పదార్థాలతోనే పరిష్కరించుకోండి. అదెలాగంటే...

hairfall, Tips for hair care in telugu
జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి!

  • కలబంద: కప్పు షాంపూలో ఒక టేబుల్‌ స్పూన్‌ కలబంద గుజ్జు, మూడు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
  • కలబంద:ముల్తానీ మట్టి: రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అవసరాన్నిబట్టి వారానికి ఒకటి, రెండుసార్లు ప్రయత్నించవచ్చు.
  • కలబంద:బ్లాక్‌ టీ: ఒక టేబుల్‌ స్పూన్‌ బ్లాక్‌ టీని కప్పు నీటిలో మరిగించాలి. నీటిని వడకట్టి తలకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తలస్నానం చేసి ఆరిన జుట్టుకు దీనిని ప్రయత్నించాలి.
  • కలబంద:నిమ్మరసం: అరకప్పు నిమ్మరసానికి కొంత నీరు చేర్చి దాన్ని నేరుగా తలకు పట్టించాలి. 10- 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. నేరుగా షాంపూలో చేర్చి దానితో తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details