తెలంగాణ

telangana

మహబూబాబాద్​లో దొంగల ముఠా అరెస్ట్

By

Published : Dec 23, 2020, 11:33 AM IST

మహబూబాబాద్​ జిల్లాకి చెందిన ఓ దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని నిందితులు చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు.

thieves-arrested-in-mahabubabad-district
మహబూబాబాద్​లో దొంగల ముఠా అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 14 తులాల బంగారం, నాలుగు తులాల వెండి ఆభరణాలు , ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల.కోటి రెడ్డి వెల్లడించారు. నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన దాసరి నర్సయ్య, మాదగాని సురేశ్, ఖమ్మం జిల్లా కై కొండాయిగూడెంకు చెందిన నార పోగు వంశీలు కలిసి ముఠాగా ఏర్పడి... తాళం వేసి ఉన్న ఇళ్లు, ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని వివరించారు.

వీరిపై ఆరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని... పీడీయాక్ట్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందికి రివార్డు ఇచ్చి అభినందించారు. డీఎస్పీ నరేశ్ కుమార్, సీఐలు వెంకటరత్నం, వెంకటేశ్వర్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పెద్దలకు తెలిసిన ప్రేమ.. బావిలో దూకి జంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details