తెలంగాణ

telangana

బాలికపై అత్యాచారయత్నం కేసులో ఇద్దరి రిమాండ్​

By

Published : Jan 4, 2021, 8:03 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూరులో మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

vikarabad, thandur, rape attempt on minor
వికారాబాద్​, తాండూర్​, బాలికపై అత్యాచారం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో పట్టణానికి చెందిన నర్సింహులు, అంజన్న అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మద్యం మత్తులో నరసింహులు అనే వ్యక్తి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అదే సమయంలో మరో వ్యక్తి అంజన్న పూటుగా మద్యం తాగి అదే ఇంట్లో ఉండటంతో పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు.

ఇద్దరు నిందితులను కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రవికుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:దారుణం: హత్య చేశారు.. మూటకట్టి చెరువులో పడేశారు!

ABOUT THE AUTHOR

...view details